భూదాన్‌పోచంపల్లి : పోచంపల్లిని గురువారం అమెరికా, కెనడా దేశానికి చెందిన 8 పర్యాటకులు సందర్శించారు. గ్రామీణ పర్యాటక కేంద్రాన్ని సందర్శించి అక్కడ మగ్గాలపై తయారవుతున్న ఇక్కత్ వస్త్రాలను పరిశీలించారు. ఇక్కత్ డిజైన్‌లను చూసి చేనేత కళాకారుల నైపుణ్యాలను కొనియాడారు. చేనేత వస్త్రాల తయారీ ఫొటో గ్యాలరీని తిలకించారు. భూదానోద్యమ చరిత్రను అడిగి తెలుసుకొని పోచంపల్లి గొప్పదనాన్ని అభినందించారు. భారతదేశ పర్యటనలో భాగంగా ఇక్కత్ వస్త్రాలకు పేరుగాంచిన పోచంపల్లిని సందర్శించడం గొప్ప అనుభూతిని ఇచ్చిందని, ఇక్కడి ప్రజల జీవన విధానాలు, స్నేహభావం ఎంతగానో ఆకట్టుకుందని విదేశీయులు కొనియాడారు.


