హుజూర్‌నగర్ : ద్విచక్ర వాహనంపై సారా తరలిస్తున్న వ్యక్తిని ఎకై ్సజ్ పోలీసులు అరెస్టు చేశారు. గురువారం ఎకై ్సజ్ సీఐ నాగార్జునరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మఠంపల్లి మండలం బాడవ తండా గ్రామానికి చెందిన బానోతు సైదా ద్విచక్ర వాహనంపై చౌటపల్లికి సారా తరలిస్తుండగా.. వాహనాల తనిఖీల్లో భాగంగా ఎకై ్సజ్ ఎస్‌ఐ జగన్మోహన్‌రెడ్డి పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి సైదాను అరెస్టు చేసినట్లు ఎకై ్సజ్ సీఐ తెలిపారు. అదేవిధంగా 5 లీటర్ల సారా స్వాధీనం చేసుకుని, ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేసినట్లు తెలిపారు.
లారీ ఢీకొని మృతి
రామన్నపేట : రోడ్డు దాటుతున్న వ్యక్తిని లారీ ఢీకొనడంతో మృతి చెందాడు. ఈ ఘటన రామన్నపేట మండలం ఇంద్రపాలనగరంలో బుధవారం రాత్రి జరిగింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన చినలచ్చి సాయిలు(65) గ్రామ పరిధిలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద బుధవారం రాత్రి చిట్యాల–భువనగిరి రోడ్డు దాటుతుండగా రామన్నపేట నుంచి భువనగిరి వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతడిని రామన్నపేట ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడికి భార్య నర్సమ్మ, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సతీష్ తెలిపారు. సాయిలును తప్పించే ప్రయత్నంలో డ్రైవర్ లారీని ఎడమ వైపునకు తిప్పడంతో రోడ్డు పక్కనే ఉన్న రెండు ద్విచక్ర వాహనాలు దెబ్బతిన్నాయి. కొద్దిదూరంలో నలుగురైదుగురు వ్యక్తులు బెంచీపై కూర్చొని ఉండగా.. వారు ప్రమాద శబ్దం విని పరుగు తీయడంతో ప్రాణాపాయం తప్పింది.
షార్ట్ సర్క్యూట్‌తో
ఇల్లు దగ్ధం
కొండమల్లేపల్లి : మండలంలోని కేశ్యతండా గ్రామ పంచాయతీ పరిధిలోని జోగ్యతండాకు చెందిన రామవత్ బోడ, సునీత దంపతుల ఇల్లు గురువారం షార్ట్ సర్క్యూట్‌తో దగ్ధమైంది. ఈ ప్రమాదంలో రూ.50 వేల నగదు, ఇంట్లోని ధాన్యం, దుస్తులు ఇతర సామాగ్రి కాలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. సుమారు రూ.2 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితులు వాపోయారు.
కిడ్నాప్ డ్రామా ఆడిన
వ్యక్తి అరెస్టు
నిడమనూరు : కిడ్నాప్ డ్రామా ఆడి తప్పుదోవ పట్టించిన వ్యక్తిపై నిడమనూరు పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిడమనూరు మండలం ఊట్కూరు గ్రామానికి చెందిన బొల్లెపల్లి శేఖర్, బత్తిని వెంకన్న కలిసి అనుముల మండలంలో 20 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని సాగు చేసేవారు. ఇటీవల కౌలు విషయంలో విభేదాలు రావడంతో వెంకన్న ఒక్కడే భూమిని కౌలుకు చేస్తున్నాడు. దీంతో వెంకన్న శేఖర్ కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా వెంకన్నను అభాసుపాలు చేయాలని పథకం రచించాడు. ఈ క్రమంలో శేఖర్ మంగళవారం తన ద్విచక్ర వాహనంపై హాలియా నుంచి ఊట్కూరు వస్తుండగా.. ఊట్కూరు గ్రామ స్టేజీ వద్ద కారులో దుండగులు వచ్చి తనను కిడ్నాప్ చేశారని డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. అనంతరం నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టు వద్ద విడిచి వెళ్లారని కిడ్నాప్ డ్రామా స్పష్టించాడు. దీంతో పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించి విచారణ చేపట్టారు. ఈ విచారణలో బొల్లెపల్లి శేఖరే కావాలని కిడ్నాప్ డ్రామా ఆడాడని నిర్ధారించుకున్నారు. దీంతో అతడిపై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ విజయ్‌కుమార్ తెలిపారు.


