యాదగిరిగుట్ట : తిరుమల తిరుపతి దేవస్థానంలోని శ్వేత భవనాన్ని గురువారం యాదగిరిగుట్ట ఈఓ భవానీ శంకర్, అధికారుల బృందం సందర్శించారు. టీటీడీలో భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించడంతో పాటు దాతలకు ఎలాంటి సౌకర్యాలు, దర్శన అవకాశాలు కల్పిస్తున్నారే అంశాలను పరిశీలించారు. టీటీడీ సమగ్ర కార్యకలపాలపై జీఎం(ఐటీ) బి. వెంకటేశ్వరనాయుడు యాదగిరిగుట్ట ఈఓతో పాటు బృందానికి వివరించారు. శ్రీవారి దర్శనం, అన్న ప్రసాదం వితరణ, కల్యాణ కట్ట, క్యూలైన్లు, భక్తులకు వసతి, ఐటీ, వివిధ ట్రస్టులు, ధార్మిక కార్యక్రమలు, విద్యాసంస్థల నిర్వాహణ, వైద్య సేవలు, శ్రీవారి సేవలు, విజిలెన్స్, క్రౌడ్ మేనేజ్‌మెంట్, కంపార్ట్‌మెంట్ల నిర్వహణ, కమాండ్ కంట్రోల్ సెంటర్, పారిశుద్ధ్యం, పచ్చదనం, గోశాల, ప్రసాద తయారీ అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా టీటీడీ అధికారులు వివరించారు. అనంతరం టీటీడీ బోర్డు సమావేశాలు, అజెండాల తయారీ, తీర్మానాలు, మినిట్స్‌లో పొందుపరిచే అంశాలు, బోర్డు కార్యకలాపాలు, బోర్టు చట్టాలు, ఎండోమెంట్ చట్టం తదిరత అంశాలపై టీటీడీ డిప్యూటీ ఈఓ ప్రశాంతి వివరించినట్లు యాదగిరిగుట్ట ఈఓ భవానీ శంకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఏఈఓ అరుణదేవి, బోర్డు సెల్ ఏఈఓ సుశీల, డీపీపీ ఏఈఓ సత్యనారాయణ, సూపరింటెండెంట్ సుశీల, మళ్లీశ్వరి, చెంగల్ రాయుడు, సీనియర్ అసిస్టెంట్ రవికుమార్, యాదగిరిగుట్ట ఆలయ అధికారులు రాజన్‌బాబు, డి. నరేష్ ఉన్నారు.
ఫ తిరుమల తిరుపతి దేవస్థానంలోని
శ్వేత భవనాన్ని పరిశీలించిన
యాదగిరిగుట్ట ఈఓ, అధికారుల బృందం


