నల్లగొండ : కూరగాయల మార్కెట్ వద్ద దొరికిన బ్యాగును పోలీస్ స్టేషన్‌లో అప్పగించి నిజాయితీ చాటుకున్నాడు నల్లగొండకు చెందిన ఆటో డ్రైవర్ మూకుండి నరేష్. గురువారం సూర్యాపేటకు చెందిన షహానా బేగం నల్లగొండ పట్టణంలోని ప్రకాశం బజార్ కూరగాయల మార్కెట్ వద్ద తన బ్యాగును మర్చిపోయింది. ఆ మార్గంలో వెళ్తున్న ఆటో డ్రైవర్ మూకుండి నరేష్ బ్యాగును గమనించి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించాడు. వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది ఆ బ్యాగు షహానా బేగందిగా గుర్తించి ఆమెను స్టేషన్‌కు పిలిపించి అందులోని సెల్‌ఫోన్, రూ.14 వేల నగదు అందజేశారు. నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్ నరేష్‌ను శాలువాతో సన్మానించి అభినందించారు.
ఫ రోడ్డుపై దొరికిన బ్యాగును
పోలీస్ స్టేషన్‌లో అప్పగింత
ఫ బాధితురాలికి అందజేసిన పోలీసులు


