గంజాయి రహిత జిల్లాగా మారుస్తాం | - | Sakshi
Sakshi News home page

గంజాయి రహిత జిల్లాగా మారుస్తాం

Jul 17 2026 12:52 AM | Updated on Jul 17 2026 12:52 AM

మోత్కూరు: జిల్లాను గంజాయి రహితంగా మార్చేందుకు కృషి చేస్తామని అడిషనల్‌ ఎస్పీ సీహెచ్‌.లక్ష్మీనారాయణ అన్నారు. గురువారం మోత్కూరు పోలీస్‌ స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. పోలీస్‌ స్టేషన్‌ పరిసరాలను పరిశీలించారు. పోలీస్‌ స్టేషన్‌ భవనం పై భాగం అక్కడక్కడ డ్యామేజ్‌ అయి ఉందని, మరమ్మతులు చేయించాలని సీఐకి సూచించారు. మరమ్మతులు చేయించేందుకు తాను కూడా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతానని తెలిపారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ గంజాయి ఎవరి దగ్గర దొరికినా వారిని వెంటనే అరెస్టు చేసి రిమాండ్‌కు పంపాలన్నారు. ఆయన వెంట ఇన్‌స్పెక్టర్‌ సి.వెంకటేశ్వర్లు, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ సతీష్‌, ఏఎస్‌ఐ వెంకన్న, హెడ్‌ కానిస్టేబుల్‌ నరసింహ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement