ప్రవళికకు ఘన స్వాగతం | - | Sakshi
Sakshi News home page

ప్రవళికకు ఘన స్వాగతం

Jul 16 2026 7:24 AM | Updated on Jul 16 2026 7:24 AM

ప్రవళికకు ఘన స్వాగతం

చైనాలో జరిగిన అథ్లెటిక్స్‌ అంతర్జాతీయ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించిన ప్రవళిక బుధవారం డిండికి చేరుకోగా.. ఆమెను గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బందితో పాటు స్థానికులు ఘన స్వాగతం పలికారు. ప్రవళికకు గురుకుల పాఠశాలల జోనల్‌ ఆఫీసర్‌ విద్యారాణి పుప్పగుచ్ఛం అందజేసి శాలువా కప్పి సన్మానించారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి పోలీస్‌ స్టేషన్‌ చౌరస్తా వరకు గురుకుల విద్యార్థినులు నిర్వహించిన ర్యాలీలో ప్రవళిక పాల్గొంది. ఈ కార్యక్రమంలో సోషల్‌ వెల్ఫేర్‌ పీడీ షంషీర్‌ అలీ, ప్రిన్సిపాల్‌ శిరీష, సర్పంచ్‌ నల్లగంతుల రవి, కోచ్‌ పరుశురాం, పీఈటీ జ్యోతి, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. అదేవిధంగా దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్‌ తన నివాసంలో ప్రవళికకు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement