భూదాన్‌పోచంపల్లి : మండలంలోని దేశ్‌ముఖి గ్రామంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా ఆర్మీ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని ప్రిన్సిపాల్ శ్రీలత బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎస్సీ అభ్యర్థులకు బీఎస్సీ, ఎంపీసీ, ఎంఎస్సీ, బీజెడ్‌సీ, ఎంజెడ్‌సీ, బీకాం సీఏ, బీకాం జీ, బీఏ గ్రూపులలో సీట్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఎస్టీ అభ్యర్థులకు ఎంపీసీలో 1, బీకామ్ జీలో 2, మైనార్టీలకు బీజెడ్‌సీలో 1 సీటు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ఆసక్తి కల్గిన అభ్యర్థులు ఈ నెల 18న ఉదయం 9గంటల లోపు ఎస్సెస్సీ, ఇంటర్ మెమో, ఆధార్‌కార్డు, స్టడీ కండక్ట్, గేమ్స్/ఎన్‌సీసీ/ ఎన్‌ఎస్‌ఎస్/ మాజీ సైనికుల పత్రాలతో పాటు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, 5 పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలతో నేరుగా హాజరుకావాలని సూచించారు. స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి విద్యార్థులను ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. విద్యార్థుల కనీస ఎత్తు 152 సెంటీమీటర్లు, కంటి చూపు +–1.5 కంటే తక్కువ ఉండాలన్నారు. ట్రాక్ సూట్, టీషర్ట్, షూ ధరించి రావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 79950 10687 నంబర్‌ను సంప్రదించాలన్నారు.
సారా తరలిస్తున్న వ్యక్తి అరెస్టు
హుజూర్‌నగర్ : ద్విచక్ర వాహనంపై సారా తరలిస్తున్న వ్యక్తిని ఎకై ్సజ్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఎకై ్సజ్ సీఐ నాగార్జునరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మఠంపల్లి మండలం లాలీతండా గ్రామానికి చెందిన బానోత్ భగ్నా ద్విచక్ర వాహనంపై సారాను తరలిస్తుండగా.. వాహన తనిఖీల్లో భాగంగా ఎకై ్సజ్ ఎస్‌ఐ జగన్మోహన్‌రెడ్డి పట్టుకున్నారు. అతడి వద్ద 3 లీటర్ల సారా స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశామన్నారు. అంతేకాకుండా అతడు సారా తయారీకి వినియోగించే 400 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసినట్లు సీఐ తెలిపారు.
డబ్బు రెట్టింపు చేస్తామని
ఆశచూపి మోసం
ఫ నకిలీ నోట్లు అంటగట్టిన ముగ్గురి అరెస్ట్
తుర్కపల్లి : డబ్బు రెట్టింపు చేస్తామని అమాయకుడికి ఆశచూపి నకిలీ నోట్లు అంటగట్టిన ముగ్గురు వ్యక్తులను తుర్కపల్లి పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఎస్‌ఐ తఖీయోద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరికి చెందిన ముదురుకోల యాకంబరం, ముదురుకోల దేవేందర్, హైదరాబాద్‌లోని హయత్‌నగర్ మండలం కుంట్లూరుకు మద్దెబోయిన నాగరాజు తుర్కపల్లి మండలానికి చెందిన ఓ వ్యక్తికి కలిసి రూ.లక్ష ఇస్తే రూ.2 లక్షలు ఇస్తామని మాయమాటలు చెప్పి నమ్మించారు. వారి మాటలు నమ్మిన బాధితుడు పల్లెపహాడ్ గ్రామ స్టేజీ వద్ద రూ.లక్ష నగదు అందజేశాడు. అనంతరం వారు ఇచ్చిన నోట్ల కట్టలను పరిశీలించగా పైన, కింద మాత్రమే అసలైన రూ.500 నోట్ల ఉండగా.. మధ్యలో చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ముద్రించిన నోట్లు ఉన్నట్లు గుర్తించాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన తుర్కపల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టి బుధవారం ముగ్గురు నిందుతులను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు ముదురుకోల యాకంబరం గతంలో సుబేదారి. గతంలోనూ పలు నకిలీ కరెన్సీ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని, జైలుకు కూడా వెళ్లి వచ్చాడని పోలీసులు గుర్తించారు. వారి నుంచి నకిలీ కరెన్సీ నోట్లు, రూ.10వేల నగదు, బైక్, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.


