ప్రైవేట్‌ బస్సును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు | - | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌ బస్సును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

Jul 16 2026 7:24 AM | Updated on Jul 16 2026 7:24 AM

చౌటుప్పల్‌ : హైవేపై యూటర్న్‌ తీసుకుంటున్న ప్రైవేట్‌ బస్సును వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటన చౌటుప్పల్‌ మండలం దండుమల్కాపురం గ్రామ శివారులోని అపెరల్‌ టెక్స్‌టైల్‌ పార్క్‌ వద్ద బుధవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్‌ మండలం తూప్రాన్‌పేట గ్రామ శివారులోని పోకర్ణ కంపెనీకి చెందిన బస్సు కంపెనీ నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్లాల్సి ఉంది. డ్రైవర్‌ దండుమల్కాపురం గ్రామ శివారులోని అపెరల్‌ పార్కు ముందు ఉన్న జంక్షన్‌ వద్ద యూటర్న్‌ చేసుకుంటుండగా.. చౌటుప్పల్‌ వైపు వస్తున్న దిల్‌సుఖ్‌నగర్‌ డిపోకు చెందిన ఆర్డీసీ బస్సు వెనుక నుంచి ప్రైవేట్‌ బస్సును ఢీకొట్టడంతో ఒక్కసారిగా హైవేపై బోల్తాపడింది. ఆ సమయంలో ప్రైవేట్‌ బస్సులో డ్రైవర్‌ ఒక్కడే ఉన్నాడు. ఆర్టీసీ బస్సులో ఉన్న పది మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. వారిని చౌటుప్పల్‌లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో హైవేపై ట్రాఫిక్‌ జాం అయ్యింది. మినీ బస్సును రోడ్డు పక్కకు తప్పించిన పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఫ హైవేపై ట్రాఫిక్‌ జాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement