భువనగిరి: గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు అవసరమైన సౌకర్యాల కల్పనకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అందిస్తున్న సేవలు అమోఘమని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి కొనియాడారు. భువనగిరి పట్టణ శివారులోఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, నిర్మాణ్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రోబోటిక్ ల్యాబ్, వివిధ రకాల సౌకర్యాలను బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. కార్పొరేట్ ఎన్విరాన్‌మెంటల్ రెస్పాన్సిబిలిటి కింద రూ.3.65 కోట్లతో జిల్లాలోని కేజీబీవీ, మోడల్ స్కూళ్లలో ఐస్పార్క్, ల్యాబ్, బంకర్ బెడ్స్, సోలార్ ఫెన్సింగ్,మెస్ డోర్లు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. విద్యార్థులు కోరుకుంటున్న రంగంలో ఎదిగేలా టీచర్లు కృషి చేయాలన్నారు. కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అందిస్తున్న సేవలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రతినిధులు ఎలిమరణ్, కై లాస్ కాంత్, డీఈఓ బి. భిక్షపతి, మున్సిపల్ చైర్మన్ తంగళ్లపల్లి శ్రీవాణిరవికుమార్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవెజ్ చిస్తీ, సెక్టోరియల్ అధికారులు రాధ, పెసరు లింగారెడ్డి, ఎంఈఓ రంగరాజన్ పాల్గొన్నారు.
ఫ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి


