నేరాలను అరికట్టడమే ధ్యేయం | - | Sakshi
Sakshi News home page

నేరాలను అరికట్టడమే ధ్యేయం

Jul 16 2026 4:54 AM | Updated on Jul 16 2026 4:54 AM

భువనగిరి: జిల్లాలో నేరాల నియంత్రణే ధ్యేయంగా పోలీస్‌శాఖ పనిచేస్తున్నట్లు ఎస్పీ అక్షాంశ్‌ యాదవ్‌ పేర్కొన్నారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా పోలీస్‌ కార్యాలయంలో జిల్లాలో నమోదైన నేరాలు, పెండింగ్‌ కేసుల దర్యాప్తు, శాంతిభద్రతల పరిరక్షణ, సైబర్‌ నేరాల నియంత్రణ, ట్రాఫిక్‌ భద్రత వంటి అంశాల పై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలన్నారు. గ్రామ స్థాయిలో ఇంటలిజెన్స్‌ వ్యవస్థను పటిష్టం చేయాలని ఆదేశించారు. ప్రతి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రోడ్డు భద్రత కార్యక్రమాలను నిరంతరం నిర్వహించాలని సూచించారు. గ్రామాల వారీగా సీసీ కెమెరాల నెట్‌ వర్క్‌ విస్తరణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. పెట్రోలింగ్‌, నాకాబందీ, వాహన తనిఖీలు నిర్వహించి నేరస్తుల కదలికలను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. సైబర్‌ నేరాల నివారణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించుకోవాలని సూచించారు. సమావేశంలో అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణ, డీఎస్పీలు, సీఐలు, ఎస్‌హెచ్‌ఓలు, సీసీఎస్‌, సైబర్‌ సెల్‌, ఐటీ సెల్‌ అధికారులు పాల్గొన్నారు.

ఫ ఎస్పీ అక్షాంశ్‌ యాదవ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement