భువనగిరి : భరోసా సెంటర్‌కు వచ్చే బాధితులకు త్వరితగతిన సేవలు అందించాలని ఎస్పీ అక్షాంశ్ యాదవ్ అన్నారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో భరోసా సెంటర్‌పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భరోసా సెంటర్‌కు వచ్చే ప్రతి కేసును వెంటనే నమోదు చేసి పర్యవేక్షణ చేయాలన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి కేసులను వేగంగా పరిష్కరించాలని సూచించారు. బాధితుల వివరాలను గోప్యంగా ఉంచుతూ వారి పట్ల గౌరవప్రదంగా వ్యవహరించాలన్నారు. బాధితులకు కౌన్సిలింగ్‌తోపాటు పునరావాస సేవలు అందించాలని సూచించారు. ఈ సందర్భంగా భరోసా సెంటర్‌కు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో భువనగిరి కోర్టు న్యాయమూర్తి మాధవీలత, ఆర్డీఓ కృష్ణారెడ్డి, అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణ, డీఎస్పీలు, ఎస్‌హెచ్‌ఓలు పాల్గొన్నారు.
ఫ ఎస్పీ అక్షాంశ్ యాదవ్


