పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని ధర్నా | - | Sakshi
Sakshi News home page

పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని ధర్నా

Jul 15 2026 5:09 AM | Updated on Jul 15 2026 5:09 AM

భువనగిరి : పీఆర్‌సీ తక్షణమే ప్రకటించి పెండింగ్‌ బిల్లులను చెల్లించాలని తపస్‌ జిల్లా అధ్యక్షురాలు రేపాక ఉమా అన్నారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం తపస్‌ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన కోసం గ్రాంట్లను విడుదల చేయాలన్నారు. తపస్‌ జిల్లా కార్యదర్శి ఇరుగు యాదగిరి, సీవీ శ్రీనివాస్‌, శ్రీధర్‌, శంకర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, రాజు, లక్ష్మణ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement