తప్పిపోయిన బాలుడు తల్లిదండ్రుల చెంతకు.. | - | Sakshi
Sakshi News home page

తప్పిపోయిన బాలుడు తల్లిదండ్రుల చెంతకు..

Jul 15 2026 5:09 AM | Updated on Jul 15 2026 5:09 AM

ఆలేరు : తప్పిపోయిన మూడేళ్ల బాలుడి వివరాలు కనుగొనేందుకు పోలీసులు సామాజిక మాధ్యమాన్ని వినియోగించుకున్నారు. బాలుడి వీడియోను వాట్సాప్‌ గ్రూపుల్లో షేర్‌ చేయడంతో తప్పిపోయిన అరగంట లోపే తండ్రి వద్దకు చేరాడు. ఆలేరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆలేరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఆదర్శనగర్‌కు చెందిన సామ్సన్‌ మూడేళ్ల కుమారుడు సాల్మన్‌ మంగళవారం ఉదయం ఇంటి నుంచి తప్పిపోయి ఆర్టీసీ బస్టాండ్‌ వద్దకు చేరుకున్నాడు. ఏడుస్తూ ఉన్న బాలుడిని గమనించిన స్థానికులు వివరాలు అడుగగా చెప్పలేకపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు బాలుడిని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లి బాలుడి వీడియోలు, ఫొటో తీసి వాట్సాప్‌ గ్రూప్‌ల్లో షేర్‌ చేశారు. అప్పటికే ఆందోళనలో ఉన్న సాల్మన్‌ తల్లిదండ్రులు వాట్సాప్‌ గ్రూప్‌లో తమ కుమారుడి వీడియోలు, ఫొటోలు చూసి వెంటనే పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. పోలీసులు వివరాలు సేకరించి బాలుడిని తండ్రి సామ్సన్‌కు అప్పగించారు.

ఫ సోషల్‌ మీడియా సహాయంతో అరగంట లోపే వివరాలు కనిపెట్టిన ఆలేరు పోలీసులు

ఫ బాలుడిని సురక్షితంగా తండ్రికి అప్పగింత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement