యాదగిరిగుట్ట రూరల్ : ప్రస్తుతం డిజిటల్ యుగంలో దేశంలో ఎక్కడికెళ్లినా, ఏ వస్తువు కొన్నా, ఎవరికై నా డబ్బులు ఇవ్వాలన్నా చాలావరకు ఫోన్ పే, గూగ్‌ల్ పే ఉపయోగిస్తున్నారు. భిక్షాటన చేసే వారు సైతం క్యూఆర్ కోడ్ స్కానర్‌లు చూపించి సరికొత్తగా భిక్షాటన చేస్తున్నారు. హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారిలో యాదగిరిగుట్ట మండలం బాహుపేట గ్రామ స్టేజీ పరిధిలో ఓ దివ్యాంగ వ్యక్తి తన మెడలో క్యూఆర్ కోడ్ స్కానర్‌ను పెట్టుకుని భిక్షాటన చేస్తూ కనిపించడంతో అటుగా వెళ్లే వారు అతడిని ఆసక్తిగా గమనించారు.


