కనగల్ : మండలంలోని చిన్నమాదారం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు, బాల సాహితీవేత్త కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి రాసిన ఊగుతున్న ఉయ్యాల బాల గేయాల పుస్తకంలోని ‘కంప్యూటర్ పిల్లలం’ గేయాన్ని మహా రాష్ట్ర ప్రభుత్వం నాలుగో తరగతి తెలుగు బాలభారతి పాఠ్యపుస్తకంలో పాఠ్యాంశంగా ఎంపిక చేసింది. దీంతో బుచ్చిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఆయన రాసిన బాల గేయం పాఠ్యాంశంగా ఎంపిక కావడం పట్ల పలువురు రచయితలు, కవులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
ఫ ఆయన రాసిన ‘కంప్యూటర్ పిల్లలం’ గేయానికి ప్రత్యేక గుర్తింపు
ఫ మహారాష్ట్ర ప్రభుత్వం ప్రచురించిన తెలుగు బాలబారతి పుస్తకంలో పాఠ్యాంశంగా ఎంపిక


