యరగండ్లపల్లిలో కేంద్ర బృందం పర్యటన | - | Sakshi
Sakshi News home page

యరగండ్లపల్లిలో కేంద్ర బృందం పర్యటన

Jul 15 2026 5:09 AM | Updated on Jul 15 2026 5:09 AM

మర్రిగూడ : కేంద్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణలో భాగంగా మంగళవారం మర్రిగూడ మండలంలోని యరగండ్లపల్లి, వట్టిపల్లి గ్రామాల్లో కేంద్ర బృందం సభ్యులు పర్యటించారు. ఆయా గ్రామాల్లో క్షేత్రస్థాయిలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి పనుల నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం యరగండ్లపల్లి జెడ్పీ హైస్కూల్‌ ఆవరణలో సర్పంచ్‌ వల్లంల సంతోష్‌యాదవ్‌ అధ్యక్షతన నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ జాయింట్‌ సెక్రటరీ లాల్‌చందమ, అండర్‌ సెక్రటరీ రాజీవ్‌ రాణా, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ నీతూ, జాయింట్‌ కమిషనర్‌ శేషుకుమార్‌, స్వచ్ఛ భారత్‌ మిషన్‌ డైరెక్టర్‌ మురళీ పాల్గొన్నారు. వీరితో పాటు నల్లగొండ జెడ్పీ సీఈఓ, అడిషనల్‌ కలెక్టర్‌ ప్రేమ్‌కరణ్‌రెడ్డి, డీఆర్‌డీఓ వై. శేఖర్‌రెడ్డి, పంచాయతీరాజ్‌ ఈఈ, జిల్లా పంచాయతీ అధికారి శంకర్‌నాయక్‌ హాజరై అభివృద్ధి పనుల పురోగతిని కేంద్ర బృందానికి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జి. చినమునయ్య, ఎంపీడీఓ బి. రవికుమార్‌, పంచాయతీ కార్యదర్శి శ్రవణ్‌కుమార్‌, ఏపీవో జయరాజు, ఈసీ వివేక్‌, ఏపీఎం వెంకటేశ్వర్లు, డీపీఎం టెక్నికల్‌ నర్సింలు, దేవరకొండ ఏపీడీ ఎన్‌.బాలకృష్ణ, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ శ్రీశైలం పాల్గొన్నారు.

చికిత్స పొందుతూ మృతి

మర్రిగూడ(చింతపల్లి) : రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతపల్లి మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన ఆలంపల్లి బంగారు(50), యాదమ్మ దంపతులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బంగారు, యాదమ్మ దంపతులు సోమవారం తమ కుమారుడు చరణ్‌తేజతో కలిసి కుర్మపల్లి గ్రామంలో మేసీ్త్ర పనికి వెళ్లారు. పని ముగించుకుని బైక్‌పై స్వగ్రామానికి వస్తుండగా.. మార్గమధ్యలో కుర్మేడు వద్దకు రాగానే మల్లేపల్లి నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న కారు వెనుక నుంచి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆలంపల్లి బంగారు తలకు గాయాలయ్యాయి. యాదమ్మ కుడిచేయి విరిగింది. చరణ్‌తేజకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వారిని మాల్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. బంగారు పరిస్థితి విషమంగా ఉండడంతో సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రామ్మూర్తి తెలిపారు.

సారా తరలిస్తున్న వ్యక్తి అరెస్టు

బైక్‌ సీజ్‌, 8 లీటర్ల సారా స్వాధీనం

హుజూర్‌నగర్‌ : సారా తరలిస్తున్న వ్యక్తిని ఎకై ్సజ్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు. మంగళవారం హుజూర్‌నగర్‌లో ఎకై ్సజ్‌ సీఐ నాగార్జునరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పాలకీడు మండలం శూన్యంపహాడ్‌ తండాకు చెందిన రమావత్‌ రాముడు బైక్‌పై సారా తరలిస్తుండగా ఎకై ్సజ్‌ అధికారుల తనిఖీల్లో పట్టుబడ్డాడు. బైక్‌ను సీజ్‌ చేసి, 8 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఈ తనిఖీల్లో ఎకై ్సజ్‌ ఎస్‌ఐ దివ్య, కానిస్టేబుళ్లు సుధాకర్‌, పుట్ట శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

జూదరుల అరెస్ట్‌

నకిరేకల్‌ : మండలంలోని నోముల గ్రామ శివారులో ఐకేపీ సెంటర్‌ సమీపంలో మంగళవారం సాంయత్రం పేకాట ఆడుతున్న ఐదుగురిని ఇన్‌స్పెక్టర్‌ హరిబాబు ఆధ్వర్యంలో పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.24,200 నగదు, నాలుగు ద్విచక్ర వాహనాలు, ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement