మోత్కూరు : మున్సిపల్ కేంద్రంలో బిక్కేరు వాగుపై ఇరుకుగా ఉన్న వంతెనపై సోమవారం ఆర్టీసీ బస్సును ట్రక్కు ఢీకొట్టింది. జనగామ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో బిక్కేరు వంతెన మీదుగా మోత్కూరు వైపు నుంచి వస్తుండగా.. ఎదురుగా భారీ ట్రక్కు వంతెన పైకి వచ్చింది. వంతెన ఇరుకుగా ఉండటంతో రెండు వాహనాలు ఎదురెదురుగా నిలిచిపోయాయి. ఆర్టీసీ బస్సును డ్రైవర్ రివర్స్ చేస్తూ వంతెన చివరి వరకు తీసుకొచ్చాడు. ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యంగా ముందుకు రావడంతో బస్సును ఢీకొంటూ వెళ్లాడు. దీంతో బస్సు స్వల్పంగా దెబ్బతింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.


