బైండోవర్‌ ఉల్లంఘించిన వ్యక్తికి జైలు | - | Sakshi
Sakshi News home page

బైండోవర్‌ ఉల్లంఘించిన వ్యక్తికి జైలు

Jul 14 2026 4:47 AM | Updated on Jul 14 2026 4:47 AM

మోతె : బైండోవర్‌ ఉల్లంఘించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఎస్‌ఐ లచ్చిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మోతె మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన పాలకూరి సాయికృష్ణపై గతంలో భూమి పంచాయితీల్లో భాగంగా క్రిమినల్‌ కేసు నమోదైంది. దీంతో అతడిని మండల తహసీల్దార్‌ ఎదుట బైండోవర్‌ చేశారు. బైండోవర్‌ ఉల్లంఘించిన సాయికృష్ణ మరో నేరానికి పాల్పడడంతో తహసీల్దార్‌ ఎం. వెంకన్న నిబంధనల ప్రకారం అతడికి నోటీలు జారీ చేశారు. అయినా అతడు స్పందించకపోవడంతో సోమవారం తహసీల్దార్‌ ఉత్తర్వుల మేరకు సాయికృష్ణను అరెస్టు చేసి వైద్య పరీక్షల అనంతరం నల్లగొండ జిల్లా జైలుకు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement