మర్రిగూడ(చింతపల్లి) : ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొనడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన చింతపల్లి మండలం కుర్మేడు గేట్ వద్ద సోమవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గొల్లపల్లి గ్రామానికి చెందిన ఆలంపల్లి బంగారి, యాదమ్మ దంపతులు మేసీ్త్ర పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. సోమవారం పని ముగించుకుని ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. కుర్మేడు గేట్ వద్ద కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వారిద్దరితో పాటు మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని మాల్‌లోని ఆస్పత్రికి తరలించారు.
బాలకార్మికులకు విముక్తి
తిప్పర్తి : బాలకార్మికులకు తిప్పర్తి పోలీసులు వెట్టిచాకిరి నుంచి విముక్తి కల్పించారు. హెడ్ కానిస్టేబుల్ సామ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏఎస్‌ఐ యాట రాంరెడ్డి ఆధ్వర్యంలో ఆపరేషన్ ముస్కాన్, స్మైల్ టీంలు సోమవారం తనిఖీలు చేపట్టారు. తిప్పర్తి మండలం దుప్పలపల్లి రైస్ మిల్లులో పనిచేస్తున్న బిహార్ రాష్ట్రానికి చెందిన దీప్, మండల కేంద్రంలోని అమ్మ హోటల్‌లో పనిచేస్తున్న రాజస్తాన్‌కు చెందిన బారన్, విజయదుర్గ బైక్ మెకానిక్ షాపులో పనిచేస్తున్న ఇందుగుల గ్రామానికి చెందిన మహేష్‌ను గుర్తించి.. వారిని తిప్పర్తి పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


