పీఏసీఎస్‌ డైరెక్టర్ల ఎంపికపై ఎమ్మెల్యేను నిలదీత | - | Sakshi
Sakshi News home page

పీఏసీఎస్‌ డైరెక్టర్ల ఎంపికపై ఎమ్మెల్యేను నిలదీత

Jul 11 2026 6:49 AM | Updated on Jul 11 2026 6:49 AM

పీఏసీఎస్‌ డైరెక్టర్ల ఎంపికపై ఎమ్మెల్యేను నిలదీత

గుండాల : గుండాల పీఏసీఎస్‌ డైరెక్టర్ల ఎంపికలో పారదర్శకత పాటించలేదని ఆరోపిస్తూ మండలంలోని నాగారం గ్రామానికి చెందిన మచ్చ కొండల్‌రెడ్డి పీఏసీఎస్‌ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవ సభలో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యను నిలదీశారు. హైదరాబాద్‌లో ఉంటూ ఇక్కడ రాజకీయాలు చేస్తూ కాంగ్రెస్‌ పార్టీ నిజమైన కార్యకర్తలను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలను ఎందుకు ఎంపిక చేయలేదంటూ ప్రశ్నించారు. దీంతో కొండల్‌రెడ్డిని ఎస్సై శోభన్‌బాబు పక్కకు తీసుకెళ్లారు. అదేవిధంగా అనంతారం గ్రామానికి చెందిన అంజయ్య సైతం ఎమ్మెల్యేను ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement