నేడు వైటీడీ పాలకమండలి ప్రమాణ స్వీకారం | - | Sakshi
Sakshi News home page

నేడు వైటీడీ పాలకమండలి ప్రమాణ స్వీకారం

Jul 11 2026 6:49 AM | Updated on Jul 11 2026 6:49 AM

యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నూతన పాలకమండలి శనివారం ఉదయం 11.37 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆలయ ముఖ మండపంలోని గర్భాలయ బంగారు వాకిలి చెంత చైర్మన్‌తో పాటు సభ్యులు, ఎక్స్‌ అఫీషియో సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారు. పాలకమండలి సభ్యులకు ఘనంగా స్వాగతం పలికేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముఖ మండపాన్ని విద్యుత్‌ దీపాలతో తీర్చిదిద్దడంతో పాటు పూలతో అలంకరించారు. ఆలయ పరిసరాలు, తిరు, మాడ వీధులు పరిశుభ్రంగా కనిపించేలా తీర్చిదిద్దారు.

మొదట చైర్మన్‌తో..

వైటీడీ పాలకమండలి చైర్మన్‌గా మహబూబ్‌నగర్‌కు చెందిన ఎం. సత్యనారాయణరెడ్డి మొదటగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత సభ్యులు వినోద్‌ వెంకటస్వామి, కొణిదెల సురేఖ, చిప్పలగారి విజయరాజం, విజయేందర్‌ తూళ్ల, పోచబోయిన ఈశ్వరమ్మయాదవ్‌, గుండా మల్లయ్య, స్వాతి కంఠమణి, ఎం. రాఘవేందర్‌రావు, లక్ష్మీనారాయణనాయక్‌, వ్యవస్థాపక ధర్మకర్త బి. నర్సింహమూర్తితో పాటు ఎక్స్‌ అఫీషియో సభ్యులచే ఆలయ ఈఓ భవానీ శంకర్‌ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం చైర్మన్‌, సభ్యులంతా కొండకు దిగువన ఉన్న ప్రెసిడెన్షియల్‌ సూట్‌లో వైటీడీ తొలి సమావేశంలో పాల్గొననున్నారు.

సాక్షి, యాదాద్రి : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్‌)లకు ప్రభుత్వం పర్సన్‌ ఇన్‌చార్జి కమిటీలను నియమిస్తోంది. ఎన్నికలతో సంబంధం లేకుండా, రూపాయి ఖర్చు కాకుండా వచ్చే ఈ పదవుల కోసం ఆశావహులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలో ఉన్న 21 పీఏసీఎస్‌లలో ఇప్పటివరకు ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో 10 పీఏసీఎస్‌లకు పాలకవర్గాలను ప్రభుత్వం ప్రకటించింది. మరికొన్ని ప్రకటించాల్సి ఉంది. తుంగతుర్తి, నకిరేకల్‌, మునుగోడు నియోజకవర్గాల్లోని ఆరు పీఏసీఎస్‌ పాలకవర్గాల కోసం ఆశావహులు ఎమ్మెల్యేలు, మంత్రుల వద్ద లాబీయింగ్‌ ముమ్మరం చేశారు.

ఆ నియోజకవర్గాల నుంచి పేర్లు ఇవ్వాలి

తుంగతుర్తి, మునుగోడు, నకిరేకల్‌ నియోజకవర్గాల నుంచి పీఏసీఎస్‌ పర్సన్‌ ఇన్‌చార్జ్‌ కమిటీ అధ్యక్షులు, డైరెక్టర్ల పేర్లు ఖరారు చేయలేదని సమాచారం. గుజ్జ, సంస్థాన్‌నారాయణపురం, చౌటుప్పల్‌, మోత్కూరు, అడ్డగూడూరు, రామన్నపేట పీఏసీఎస్‌లకు పాలకవర్గాలను నియమించాల్సి ఉంది. తమకు అవకాశం కల్పించాలని కోరుతూ ఆశావహులు ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

ఇలా ఎంపిక చేస్తారు

ఎమ్మెల్యేలు తమ పరిధిలోని పీఏసీఎస్‌లకు పాలకవర్గ సభ్యుల పేర్లను ఖరారు చేసి జిల్లా సహకార అధికారికి ఇస్తారు. సీఈవోలు పీఏసీఎస్‌ల పరిధిలో ఓటు హక్కు ఉందా, లేదా వంటివి విచారణ చేసి ఎమ్మెల్యేకు నివేదిక ఇస్తారు. ఆయన తన నియోజకవర్గంలో పాలక వర్గాలను ప్రకటించాలని కోరుతూ వ్యవసాయ శాఖ మంత్రికి లెటర్‌ ఇస్తారు. దాని ఆధారంగా మంత్రి సహకార శాఖ రిజిస్ట్రార్‌కు పంపించి పాలకవర్గ సభ్యులను అధికారికంగా ప్రకటిస్తారు.

అత్యధికంగా ఇక్కడే..

రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటిస్తున్న పీఏసీఎస్‌లలో అత్యధికంగా పది పాలకవర్గాలను ఈ జిల్లాలోనే ప్రకటించారు. భువనగిరి, చందుపట్ల, బీబీనగర్‌, ఆలేరు, యాదగిరిగుట్ట, రేణికుంట, తుర్కపల్లి, ఆత్మకూర్‌.ఎం, గుండాల, బొమ్మలరామారం పాలకవర్గాలను నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. శుక్రవారం నాటికి వీరంతా కొలువు దీరారు. కాగా.. వంగపల్లి పీఏసీఎస్‌ పర్సన్‌ ఇన్‌చార్జ్‌ కమిటీ అధ్యక్షుడి పేరు ప్రకటించడంలో క్లరికల్‌ మిస్టేక్‌తో ఆగిపోయినట్లు సమాచారం. అయితే వలిగొండ, ఆరూర్‌, జూలూరు, పోచంపల్లి పీఏసీఎస్‌ల పాలకవర్గాల పేర్లను ప్రకటించాల్సి ఉంది.

వేగవంతంగా ఓటరు డిజిటలైజేషన్‌ ప్రక్రియ

కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

ఫ పది చోట్ల కొలువుదీరిన పీఏసీఎస్‌ పాలకవర్గాలు

ఫ నేడో.. రేపో.. మరో ఐదు ఖరారయ్యే అవకాశం

ఫ తుంగతుర్తి, మునుగోడు, నకిరేకల్‌లో ఆలస్యం

ఫ ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణ.. ఆశావహుల్లో ఉత్కంఠ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement