8.50 లక్షలకు చేరువలో జనాభా | - | Sakshi
Sakshi News home page

8.50 లక్షలకు చేరువలో జనాభా

Jul 11 2026 6:49 AM | Updated on Jul 11 2026 6:49 AM

ప్రణాళికాబద్ధమైన కుటుంబ జీవనం

నేడు విద్యా, శాసీ్త్రయ విజ్ఞానం అబివృద్ధి చెందడంతో యువ దంపతులు తమకు ఎప్పుడు సంతానం కావాలి. ఎంత మంది కావాలి అని నిర్ణయించుకుని తమ కుటుంబ ఆరోగ్యంగా ఉండేలా చూసుకుంటున్నారు. తమ పిల్లలకు చక్కని విద్యను అందించడం ఆరోగ్యవంతమైన పరిసరాల్లో పెరిగే అవకాశం కల్పించడం తప్పనిసరి అని భావిస్తున్న తల్లిదండ్రులు దానికి తగ్గట్టుగా తమ ఆర్థిక స్థితి ఉండేలా చూసుకుంటున్నారు. ఎక్కువ మంది పిల్లలు పుట్టినట్లయితే వారి అవసరాలను తీర్చడంతమకు కష్టమని వారు గుర్తిస్తున్నారు అందుకే తక్కువ సంతానంతోనే చిన్న కుటుంబానికి పరిమితం చేసుకుంటున్నారు.

భువనగిరి : ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలల్లో జనాభా పెరుగుతోంది. జనాభా పెరగడం వల్ల కలిగే సమస్యలు, సమాజం పై దాని ప్రభావాన్ని తెలియజేసే లక్ష్యంతో ప్రతి సంవత్సరం జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవంగా నిర్వహిస్తుంటారు. పెరుగుతున్న జనాభాతో తలెత్తే సమస్యలను వివరించేందుకు ఐక్యరాజ్యసమితి ప్రపంచ జనాభా దినోత్సవం 1989లో ప్రారంభించింది.

8లక్షలకు చేరువులో..:

2011 జనాభా లెక్కలే ఇప్పటికి ప్రామాణికంగా ఉండగా త్వరలోనే కేంద్రం ప్రభుత్వం జనగణన చేసే కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ముందుగా రాష్ట్ర ప్రభుత్వం 2024లో చేసిన కులగణన వివరాలను గతంలో వెల్లడించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనాభా 7,70,833 మంది ఉండగా ఇందులో మహిళలు 3,80,341 మంది, పురుషులు 3,90,482 మంది ఉండగా 1,88,520 కుటుంబాలు ఉన్నాయి. గత మే నెల 11 నుంచి గత నెల 9వ తేది వరకు జిలాలలో జనగణనలో భాగంగా ముందుగా ఇళ్లలను లెక్కించారు. 2027 ఫిబ్రవరిలో జనగణన సర్వే జరగనుంది. కాగా గత సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిన కులగణన లెక్కల ప్రకారం జిల్లా జనాభా 8.50 లక్షల చేరువలో ఉంది.

ఫ ఏటేటా పెరుగుతున్న జనాభా

ఫ 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనాభా 7,70,833 మంది

ఫ నేడు ప్రపంచ జనాభా దినోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement