అరచేతిలో హైవే సమాచారం | - | Sakshi
Sakshi News home page

అరచేతిలో హైవే సమాచారం

Jul 10 2026 9:45 AM | Updated on Jul 10 2026 9:45 AM

చిట్యాల : 65వ నంబర్‌ జాతీయ రహదారిపై ప్రయాణించే వారికి అవసరమైన సేవలను, సమాచారాన్ని క్షణాల్లో అందించే దిశగా నేషనల్‌ హైవే అధికారులు శ్రీకారం చుట్టారు. చిట్యాల మండల పరిధిలో హైవేపై క్యూఆర్‌ కోడ్‌లతో కూడిన డిజిటల్‌ సమాచార బోర్డులను రహదారి నిర్వహణ బాధ్యతలను చేపట్టిన కాంట్రాక్ట్‌ సంస్థ(సరన్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ) ఏర్పాటు చేస్తోంది. చిట్యాల మండల పరిధిలో హైవే వెంట గ్రామాలు, బ్లాక్‌ స్పాట్‌ల వద్ద, ట్రక్‌ బే ఉన్న చోట ఈ బోర్డులను ఏర్పాటు చేశారు. ఈ క్యూఆర్‌ కోడ్‌ను మొబైల్‌లో స్కాన్‌ చేయగానే హైవే నిర్వహణ కాంట్రాక్ట్‌ సంస్థ వివరాలు, మొత్తం దూరం, టోల్‌ప్లాజాల వివరాలు, టోల్‌ ప్లాజాల మేనేజర్‌ నంబర్లు, హోటళ్లు, దాబాలు, పంక్చర్‌ షాపులు, టాయిలెట్స్‌, విశ్రాంతి కేంద్రాల సమాచారం, దూరం వంటి వివరాలు తెలుస్తాయి. ప్రమాదాలు జరిగినప్పుడు సంప్రదించాల్సిన హైవే అధికారుల టోల్‌ ఫ్రీ నంబర్లు, అంబులెన్స్‌, పోలీస్‌ స్టేషన్‌లు, హైవే పెట్రోలింగ్‌ సేవలు, దగ్గరలో ఉన్న పట్టణాల సమాచారం లభిస్తుంది. ముఖ్యంగా రాత్రివేళ ప్రయాణించేవారికి క్యూఆర్‌ కోడ్‌ సమాచార వ్యవస్థ ఎంతో ఉపయోగపడుతుంది.

చిట్యాల పరిధిలో హైవేపై క్యూఆర్‌ కోడ్‌లతో కూడిన బోర్డుల ఏర్పాటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement