మెనూ ప్రకారం భోజనం అందించాలి | - | Sakshi
Sakshi News home page

మెనూ ప్రకారం భోజనం అందించాలి

Jul 8 2026 2:02 AM | Updated on Jul 8 2026 2:02 AM

గుండాల : విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి సూచించారు. మంగళవారం గుండాల మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం, మోడల్‌ స్కూల్‌ను కలెక్టర్‌ తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనాలను పరిశీలించారు. మోడల్‌ స్కూల్‌లోని స్టోర్‌ రూమ్‌లో కూరగాయలపై ఈగలు వాలుతుండటంతో ప్రిన్సిపాల్‌ రాములును మందలించారు. విద్యార్థులకు అందించే ఆహార పదార్థాలను శుభ్రంగా ఉంచాలని, కూరగాయలను స్టోర్‌ చేసేందుకు టేబుల్‌ ఏర్పాటు చేయాలని, సరుకులు తాజాగా ఉంచాలని ఆదేశించారు. విద్యార్థులకు గుడ్డు అందిస్తున్నారా ? అని ప్రిన్సిపాల్‌ను అడిగి తెలుసుకున్నారు. కస్తూర్బాగాంధీ విద్యాలయంలో నిర్మిస్తున్న ప్రహరీ వివరాలను ఎస్‌ఓ విజయలక్ష్మిని అడిగి తెలుసుకున్నారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. కేజీబీవీలో 6వ తరగతిలోకి వెళ్లి బాలికలచే పాఠాలు చదివించారు. అనంతరం మోడల్‌ స్కూల్‌ ముందు ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. పాఠశాలలో మరుగు దొడ్లు అపరిశుభ్రంగా ఉండటంతో ప్రిన్సిపాల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఎం సీ్త్ర నిధులు వచ్చినా ఎందుకు మరమ్మతులు చేపట్టడం లేదని ప్రిన్సిపాల్‌ను అడిగారు. 2వ విడత ఇందిరమ్మ ఇళ్లకు గుడిసెలు ఉన్నవారిని ఎంపిక చేయాలన్నారు. ఆయన వెంట డీఈఓ బొల్లారం భిక్షపతి, తహసీల్దార్‌ ఎస్‌.హరికృష్ణ, ఎంపీడీఓ చండీరాణి, ఏఈలు దామోదర్‌, కావ్యశ్రీ, ఎంఈఓ అగ్గిరాములు, ఎస్‌ఓ విజయలక్ష్మి, సర్పంచ్‌ దేవనబోయిన అయిలయ్య ఉన్నారు.

ఫ కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement