యాదగిరిగుట్ట: కరువును పారదోలడానికి, రైతులకు సాగు నీరు అందించేందుకు కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేసి, గోదావరి జలాలను విడుదల చేయాలని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునితామహేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు.యాదగిరిగుట్ట పట్టణంలో సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. రైతాంగాన్ని దెబ్బ తీసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కుట్రలు చేస్తున్నారని, అందుకే కాళేశ్వరంలో భాగమైన కన్నెపల్లి రిజర్వాయర్ పంప్ హౌస్ నుంచి మోటర్లు ఆన్ చేయడం లేదన్నారు. ఎల్ నినోతో వానలు లేక, పొలాలు ఎండుతుంటే రైతులు ఆందోళన చెందుతుంటే సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నాని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ ఇచ్చిన వరం అని, ఇప్పటికే మేడిగడ్డ వద్ద లక్ష క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి వెళ్తున్నాయని తెలిపారు.


