భువనగిరి : ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల హక్కుల సాధనకు బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో బుధవారం భువనగిరిలోని ప్రిన్సిస్ చౌరస్తా వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతతో కలిసి ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ హామీని అమలు చేయలేదన్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకపోతే బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. అదేవిధంగా ఇటీవల పట్టణంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చెట్టు కొమ్మలు విరిగి గాయలైన విద్యార్థిని ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆయన వెంట బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, పార్టీ పట్టణ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు ఏవీ కిరణ్‌కుమార్, రచ్చ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు, కౌన్సిలర్లు తదితరులున్నారు.
ఫ మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి


