వ్యభిచార కూపంలోకి నెట్టడం అమానుషం | - | Sakshi
Sakshi News home page

వ్యభిచార కూపంలోకి నెట్టడం అమానుషం

Aug 20 2026 7:26 AM | Updated on Aug 20 2026 7:26 AM

యాదగిరిగుట్ట: మానవ అక్రమ రవాణా బాధితులకు న్యాయ సేవా సంస్థ సంబంధిత శాఖల సమన్వయంతో పునారావాసం, పరిహారం, న్యాయ సేవలు అందించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మాధవిలత అన్నారు. బుధవారం యాదగిరిగుట్ట పట్టణంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ, యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ యూనిట్‌, జిల్లా యంత్రాంగం సంయుక్తంగా మానవ అక్రమ రవాణ బాధితులకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవిలత మాట్లాడుతూ.. యువతులను వ్యభిచార కూపంలోకి పంపడం అమానుషమని, దీనిని అరికట్టేందుకు కృషి చేయాలన్నారు. పునరావాసంలో భాగంగా అన్ని శాఖల జిల్లా అధికారులతో సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడమే కాకుండా వారికి మద్దతుగా సేవలు అందిస్తారని తెలిపారు. డీఎస్పీ శ్రీనివాస్‌ నాయుడు మాట్లాడుతూ.. అక్రమ రవాణా బాధితులను గుర్తించి, వారి పిల్లలకు ఉన్నత విద్యను అందించడంలో పోలీస్‌ శాఖ కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో యాదాద్రి బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శ్రీహరి, చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ అధ్యక్షులు జయశ్రీ, డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్‌ నాగిరెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి సీహెచ్‌ శ్రీనివాస్‌, జిల్లా ఎంప్లాయిమెంట్‌ ఎక్స్‌చేంజి అధికారి పద్మ, జిల్లా ఎస్సీ డెవలప్‌మెంట్‌ అధికారి సురేష్‌, జిల్లా యూత్‌, స్పోర్ట్స్‌ అధికారి శ్యాంసుందర్‌, జిల్లా బాలల సంక్షేమ అధికారిణి అనంతలక్ష్మి, జిల్లా విద్యాశాఖ సీఈఓ లింగారెడ్డి, ఎయిడ్స్‌ కంట్రోల్‌ యూనిటీ డీపీఎం సుధాకర్‌, స్వామి రామానంద తీర్థ రూరల్‌ ఇనిస్టిట్యూట్‌ డీటీఓ గుర్రం వెంకటేష్‌, సఖి కేంద సెంట్రల్‌ అడ్మిన్‌ వినీలా, సార్ప్‌ ఎన్‌జీఓ ప్రమీల, స్కిడ్‌ ఎన్‌జీవో పిడీ నాగరాజు, మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ తదితరులున్నారు.

ఫ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మాధవిలత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement