క్రీడాకారుల్లో నైపుణ్యాన్ని వెలికితీసేందుకు కృషి
నకిరేకల్: క్రీడాకారుల్లో క్రీడానైపుణ్యాన్ని వెలికితీసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. నకిరేకల్ మండలంలోని మంగళపల్లి గ్రామంలో మూడు రోజుల పాటు జరగనున్న 47వ తెలంగాణ హ్యాండ్ బాల్ రాష్ట్ర స్థాయి పోటీలను బుధవారం ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలోని ఉమ్మడి 10 జిల్లాల నుంచి 450 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు ప్రతిభను కనబర్చి జాతీయ స్థాయిలో రాణించాలన్నారు. తన వంతుగా క్రీడాకారుల సంక్షేమానికి బడ్జెట్‌లో నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ హ్యాండ్ బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి శ్యామల పవన్ కుమార్ మాట్లాడుతూ.. ఇక్కడ ప్రతిభ చూపిన క్రీడాకారులను రెండు జట్లుగా ఎంపిక చేసి ఈనెల 18 నుంచి బీహార్‌లోని నవాడలో జరిగే జాతీయ స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు పంపించనున్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చింతకాయల పుల్లయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బచ్చుపల్లి శ్రీదేవి, హ్యాండ్‌బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఉస్మాన్, పీఏసీఎస్ చైర్మన్ నాగులంచ వెంకటేశ్వరరావు, ఏవీఎం విద్యాసంస్థల అధినేత కందాల పాపిరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నకిరేకంటి ఏసుపాదం, స్థానిక పాఠశాల హెచ్‌ఎం కర్ర వీరారెడ్డి, స్థానిక పాల కేంద్రం చైర్మన్ చింతల ముత్తయ్య పాల్గొన్నారు.
ఫ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
ఫ మంగళపల్లిలో ప్రారంభమైన
రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలు
ఫ ఉమ్మడి 10 జిల్లాల నుంచి హాజరైన 450 మంది క్రీడాకారులు
క్రీడాకారుల్లో నైపుణ్యాన్ని వెలికితీసేందుకు కృషి


