పేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం
భువనగిరిటౌన్ : ఇందిరమ్మ పథకం కింద ఇంటి నిర్మాణానికి రూ.5లక్షల ఆర్థిక సహాయం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు అండగా ఉంటోందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. భువనగిరి పట్టణంతోపాటు మండలంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన 1,200 మంది లబ్ధిదారులకు మంగళవారం జిల్లా కేంద్రంలోని ఏకే ప్యాలెస్‌లో జిల్లా కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్ భాస్కరరావుతో కలిసి ప్రొసీడింగ్ కాపీలను అందజేసి మాట్లాడారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో హామీలు తప్ప అమలు చేసింది శూన్యమని ఆరోపించారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మించి లబ్ధిదారులకు ఇవ్వకుడా నిర్లక్ష్యం చేయడంతో ఇప్పుడు అవి కూలిపోయే దశలో ఉన్నాయన్నారు. కాంగ్రెస్ ప్రజాపాలనలో ఇళ్లులేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తుండడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇసుక కొరత లేకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ పడుతుందన్నారు. ఇళ్ల లబ్ధిదారులు ఈ నెల 9వ తేదీలోపు ముగ్గు పోసుకు భూమిపూజ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు సూచించారు. బేస్మెంట్ పూర్తి చేసుకున్న వెంటనే ప్రభుత్వం మీ ఖాతాల్లో లక్ష రూపాయలు జమ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవేజ్ చిస్తీ, ఎస్సీ కార్పొరేషన్ శ్యామ్‌సుందర్, హౌసింగ్ పీడీ విజయ్‌సింగ్, ప్రజా ప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
ఫ ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి
ఫ భువనగిరిలో కలెక్టర్‌తో కలిసి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేత


