ఓ విద్యార్థి మరో విద్యార్థిపై కత్తితో దాడి.. ఇంతలో.. | - | Sakshi
Sakshi News home page

ఓ విద్యార్థి మరో విద్యార్థిపై కత్తితో దాడి.. ఇంతలో..

Aug 11 2023 6:52 AM | Updated on Aug 11 2023 1:54 PM

- - Sakshi

యాదాద్రి: మండల కేంద్రంలోని మోడల్‌ స్కూల్‌కు చెందిన ఇద్దరు విద్యార్థుల మధ్య గురువారం చోటుచేసుకున్న ఘర్షణలో ఓ విద్యార్థి మరో విద్యార్థిపై కత్తితో దాడి చేశాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోడల్‌ స్కూల్‌లో ఇంటర్మీడియట్‌ ఫస్టియర్‌ చదువుతున్న చింతపల్లి మండల కేంద్రానికి చెందిన విద్యార్థి అదే పాఠశాలలో ఇంటర్మీడియట్‌ సెకండియర్‌ చదువుతున్న వింజమూరు గ్రామానికి చెందిన విద్యార్థి గురువారం సాయంత్రం పాఠశాల పక్కనే ఉన్న స్థలంలో గొడవ పడ్డారు.

ఈ క్రమంలో సెకండియర్‌ విద్యార్థి కత్తితో ఫస్టియర్‌ విద్యార్థిపై దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆ విద్యార్థిని వెంటనే మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ సతీష్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.

Advertisement
 
Advertisement
Advertisement