● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు
● పాలకొల్లు చైర్‌పర్సన్ అభ్యర్థిగా చందక ఉమాశైలజ
పాలకొల్లు సెంట్రల్: కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ఇదే వైఎస్సార్‌సీపీ విజయానికి నాంది అని, ఓటుతో ప్రజలు ప్రభుత్వానికి బుద్ధి చెప్పా లని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు అన్నారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాయలంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ పాలకొల్లు మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా మాజీ కౌన్సిలర్ చందక ఉమాశైలజను ఎంపిక చేశామన్నారు. ఆమె భర్త సత్తిబాబు కూడా కౌన్సిలర్‌గా పనిచేశారన్నారు. ఉమాశైలజ గత పాలకమండలిలో అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టడంలో ఎంతో పోరాటం చేశారన్నారు. ఇటువంటి పట్టుదల, పోరాటం ఉన్న అభ్యర్థిని చైర్మన్ అయితే మున్సిపాలిటీలో సమస్యలను పరిష్కరించుకోవచ్చన్నారు. పట్టణంలో డంపింగ్ యార్డు, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతులను సమకూర్చుకోవచ్చన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల కమిషన్, పోలీసు వ్యవస్థలను ఉపయోగించుకుని నామినేషన్లు లేకుండా రిగ్గింగులతో ఎన్నికలు నిర్వహిస్తోందని మండిపడ్డారు. ఎవరెన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా పరిషత్ ఎన్నికల్లో పార్టీ శ్రేణులు సైనికుల్లా పోరాడారన్నారు. పాలకొల్లు పట్టణంలో కూటమి ప్రభు త్వం ప్రచారార్భాటం తప్ప అభివృద్ధి లేదని, తు పాను కష్టాల నుంచి ప్రజలు ఇంకా కోలుకోలేదన్నా రు. నష్టపోయిన పంటకు ఇన్‌పుట్ సబ్సిడీ ప్రకటించలేదని, కూలిపోయిన గృహాలకు ఎలాంటి సా యం ఇవ్వలేదని, కొన్ని గ్రామాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరించలేదని ప్రసాదరాజు అన్నారు.
పాలకొల్లును జగన్‌కు గిఫ్టుగా ఇస్తాం
నియోజకవర్గ ఇన్‌చార్జి గుడాల శ్రీహరిగోపాలరావు (గోపి) మాట్లాడుతూ పట్టణంలో చైర్‌పర్సన్ అభ్యర్థిని, 44 మంది వార్డు కౌన్సిలర్లను గెలిపించి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి గిఫ్టుగా ఇస్తామన్నారు. ఉ మాశైలజ మాట్లాడుతూ చైర్‌పర్సన్ అభ్యర్థినిగా తనకు అవకాశం కల్పించిన జగనన్నకు జిల్లా, ని యోజకవర్గ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. త న విజయానికి పార్టీ శ్రేణులంతా సహకరించాలని కోరారు. పార్టీ పరిశీలకుడు పేరిచర్ల నర్సింహరాజు, పార్లమెంట్ పరిశీలకురాలు గూడూరి ఉమాబాల, సీఈసీ సభ్యులు గుణ్ణం నాగబాబు, మేకా శేషుబాబు, యడ్ల తాతాజీ, చెల్లెం ఆనందప్రకాష్, నడపన గోవిందరాజులు నాయుడు, కోరాడ శ్రీనివాస్, చందక సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.


