తాడేపల్లిగూడెం.. 68ఏళ్ల ప్రస్థానం | - | Sakshi
Sakshi News home page

తాడేపల్లిగూడెం.. 68ఏళ్ల ప్రస్థానం

Nov 16 2026 1:26 AM | Updated on Nov 16 2026 1:26 AM

● పంచాయతీ నుంచి స్పెషల్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీ స్థాయికి..

● 1.03 లక్షలకు చేరిన జనాభా

● 44 వార్డులుగా పట్టణం

తాడేపల్లిగూడెం : పంచాయతీ నుంచి 68 ఏళ్ల కిత్రం మున్సిపాలిటీగా రూపాంతరం చెంది ప్రస్తుతం స్పెషల్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీగా తాడేపల్లిగూడెం పుర పాలక సంఘం సేవలందిస్తోంది. పట్టణ రూపశిల్పి గా మొదటి ఫ్లై ఓవర్‌ వంతెన నిర్మాణం, పంపుల చె రువు తవ్వించి ఈలి ఆంజనేయులు చరిత్రలో నిలిచిపోయారు. 1928లో పంచాయతీగా ఏర్పడిన తాడేపల్లిగూడెం 30 ఏళ్ల తర్వాత 1958లో మున్సిపాలిటీగా ఆవిర్భవించింది. మెండు నరసింహారావు సర్పంచ్‌ గా ఉండగా అప్పటికే రెవెన్యూ గ్రామాలుగా ఉన్న జువ్వలపాలెం, తాళ్లముదునూరుపాడు, యాగర్లపల్లి, కడకట్ల కలిపి మున్సిపాలిటీగా ఏర్పాటుచేశారు. 1980 నాటికి ఫస్ట్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్‌ అయ్యింది. 2010 నాటికి సెలెక్షన్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీ అయ్యింది. 35 వార్డులు, 39 నోటిఫైడ్‌ స్లమ్‌లు, మూడు నాన్‌ నోటిఫైడ్‌ స్లమ్‌లతో 20.71 చదరపు కిలోమీటర్లలో విస్తరించి, 2011 జనాభా లెక్కల ప్రకారం 1,03,577 మంది జనాభా ఉంది. ప్రస్తుతం గూడెం మండలంలోని ఎల్‌.అగ్రహారం, కుంచనపల్లి, పడాల, కొండ్రుపోలు, పెంటపాడు మండలంలో ని ప్రత్తిపాడు గ్రామాలు కలిపి 48 వార్డులుగా మున్సిపాలిటీ విస్తరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement