భీమవరం అభివృద్ధే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

భీమవరం అభివృద్ధే లక్ష్యం

Nov 16 2026 1:26 AM | Updated on Nov 16 2026 1:26 AM

● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రసాదరాజు

● చైర్‌పర్సన్‌ అభ్యర్థినిగా యాదాల మాధవీలత

భీమవరం (ప్రకాశంచౌక్‌): భీమవరం పట్టణ అభివృద్ధి లక్ష్యంగా 52 వా ర్డుల్లోనూ పోటీ చేస్తున్నట్టు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు తెలిపారు. ఆదివారం వైఎస్సార్‌సీపీ చైర్‌పర్సన్‌ అభ్యర్థినిగా భీమవరం కిరాణా మ ర్చంట్స్‌ అసోసియేషన్‌ కోశాధికారి యాదాల ప్రసాదరావు సతీమణి వెంకట మాధవీలతను ప్రకటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పట్టణంలో యాదాల కుటుంబం దివంగత సీఎం వైఎస్సార్‌, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెంట కొనసాగుతున్నారన్నారు. భీమవరాన్ని అభివృద్ధి చేయగలిగే సమర్థత విద్యావంతురాలైన మాధవీలతకు ఉందన్నారు. పట్టణంలో సమస్యల పరిష్కారంపై మాధవీలతకు పూర్తి అవగాహన ఉందన్నారు. కూటమి ప్రభుత్వం భీమవరం అభివృద్ధిని గాలికి వదిలేసిందని, డ్రెయిన్లు, శివారు ప్రాంతాల్లో తాగునీటి సమస్య, పారిశుద్ధ్యం అధ్వానమే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రతి వార్డును అభివృద్ధి చేయడమే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు కృషిచేస్తారన్నారు. ఇప్పటికే 15 మంది అభ్యర్థులు కూటమి అభ్యర్థుల కంటే ముందే నామినేషన్లు వేశారన్నారు. ఇటీవల వరుస తుపాన్లతో వరి పంట పూర్తిగా దెబ్బతింటే కూటమి ప్రభుత్వం కనీసం రైతులను ఆదుకోలేదని విమర్శించారు. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ పాలనలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ, తుపాన్ల వంటి విపత్తు సమయంలో పంటలకు బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీ వంటివి అందించి ఆదుకున్నారని గుర్తుచేశారు. కూటమి ప్ర భుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్ని కుట్రలు, ప్ర లోభాలకు గురిచేసినా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. అదే స్ఫూర్తితో మున్సిపల్‌ ఎన్నికల్లోనూ ప్రజా మద్దతుతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించుకుంటామన్నారు. నరసాపురం పార్లమెంట్‌ ఇన్‌చార్జి గూ డూరి ఉమాబాల, పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు కోడే విజయలక్ష్మి, భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త చినమిల్లి వెంకటరాయుడు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థి యాదాల వెంకట మాధవీలత, ప్రసాదరావు, నాయకులు కోడే యుగంధర్‌, కామన నాగేశ్వరరావు, ఏఎస్‌ రాజు, పేరిచర్ల విజయనర్సింహరాజు, గాదిరాజు రామరాజు, చిగురుపాటి సందీప్‌, గుంటి ప్రభు, వాసర్ల ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement