మందుబాబులకు చెక్‌ | - | Sakshi
Sakshi News home page

మందుబాబులకు చెక్‌

Oct 1 2026 9:45 AM | Updated on Oct 1 2026 9:45 AM

మందుబాబులకు చెక్‌

కైకలూరు : పామర్రు–దిగమర్రు జాతీయ రహదారి (165) విస్తరణ పనుల్లో గోపవరం–అగ్రహారం బైపాస్‌ రోడ్డులో తాగుబోతులకు కై కలూరు టౌన్‌ పోలీసులు బుధవారం చెక్‌ పెట్టారు. ఇక్కడ సమస్యపై ‘ప్రారంభానికి ముందే తాగుబోతుల రహదారి’ శీర్షికన గతనెల 22న ‘సాక్షి’లో వెలువడిన కథనానికి స్పందించారు. సీఐ ఏవీఎస్‌ రామకృష్ణ ఆ దేశాలతో ఎస్సై కె.గణేష్‌ వర్మ నిఘాను ముమ్మరం చేశారు. మంగళవారం రాత్రి హైవే బైపాస్‌లో బహిరంగంగా మద్యం సేవిస్తున్న 10 మందిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. వారితోనే ఉదయం బైపాస్‌ సమీపంలో తాగి పడేసిన మద్య సీసాలను సంచులతో ఎత్తించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం నేరమని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement