వీసీ సత్యనారాయణ
పెనుమంట్ర: దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేతులమీదుగా 2004లో 75 వసంతాల ఉత్సవం జరుపుకున్న ఈ వ్యవసాయ పరిశోధన స్థానంలో నేడు వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల సిల్వర్ జూబ్లీ ఉత్సవాల నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ పీవీ సత్యనారాయణ అన్నారు. బుధవారం మార్టేరు వ్యవసాయ పరిశోధన స్థానంలో జరిగిన పాలిటెక్నిక్ కళాశాల సిల్వర్ జూబ్లీ ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వ్యవసాయ పాలిటెక్నిక్ ఎందరో పేద విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించిందన్నారు. ది నదినాభివృద్ధి చెందుతూ దేశంలోనే ఉన్నత విద్యార్థులను తీర్చిదిద్దిన ఘనతను దక్కించుకుందన్నారు. కళాశాలను మరింత అభివృద్ధి చే సేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నట్టు చె ప్పారు. మరో ముఖ్య అతిథి స్థానిక ఎమ్మెల్యే పి తాని సత్యనారాయణ మాట్లాడుతూ దేశంలోనే అత్యున్నత స్థానంలో ఉన్న వ్యవసాయ పరిశోధన స్థానంతో పాటు పాలిటెక్నిక్ కళాశాలను కూడా మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు శాస్త్రవేత్తలు కృషి చేయాలన్నారు. నిధుల మంజూరుకు కృషిచేస్తానన్నారు. అనంతరం ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు అవార్డులతో పాటు నగదు బహుమతులను అందజేశారు. విద్యార్థుల సాంస్కతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వ్యవసాయ పరిశోధన స్థానం కేటీఆర్ డాక్టర్ సీహెచ్ శ్రీనివాస్, రిటైర్డ్ ఏడీఆర్ జహీరుద్దీన్, ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలు తదితరులు పాల్గొన్నారు.


