నామాలస్వామికే ఎగనామం! | - | Sakshi
Sakshi News home page

నామాలస్వామికే ఎగనామం!

Oct 1 2026 9:45 AM | Updated on Oct 1 2026 9:45 AM

● కాంట్రాక్టర్‌కు ఉచితంగా కాటేజీ

● దేవస్థానానికి జమకాని రూ.6,574 అద్దె

ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల శ్రీవారి కొండపై ఓ కాటేజీని దేవస్థానం అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఒక కాంట్రాక్టర్‌కు అద్దె లేకుండా రెండు రోజులపాటు ఉచితంగా కేటాయించడం వివాదాస్పదమవుతోంది. అందులోనూ ఆ కాంట్రాక్టర్‌ పారిశుద్ధ్య కార్మికుల పీఎఫ్‌ సొమ్ము ఎగవేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి కావడం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. దేవస్థానంలో 2022 నుంచి 2025 సెప్టెంబర్‌ నెలాఖరు వరకు మంగళగిరికి చెందిన ‘సెవెన్‌ హిల్స్‌ ఫెసిలిటీ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ సంస్థ పారిశుద్ధ్య పనులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో జరిగిన అవకతకవలు, ఆరోపణల నేపథ్యంలో రూ.60 లక్షలకు పైగా నగదును కాంట్రాక్టర్‌కు చెల్లించకుండా దేవస్థానం ని లిపివేసింది. ఇప్పుడు ఆ నగదును ఎలాగైనా కాంట్రాక్టర్‌కు ముట్టచెప్పాలని కొందరు అధికారులు ప్ర యత్నిస్తున్నారన్న ఆరోపణలపై ‘సాక్షి’లో బుధవారం ‘స్వామీ.. ఇదేం గూడుపుఠాణి?’ శీర్షికన ప్ర చురితమైన కథనం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే సదరు కాంట్రాక్టర్‌ దేవస్థానం కాటేజీ అద్దెను ఎగవేసిన విషయం బయటకు వచ్చింది.

ఆదాయానికి గండి : తన పనులు చక్కదిద్దుకునేందుకు ఈనెల 23న సాయంత్రం క్షేత్రానికి వచ్చిన సదరు కాంట్రాక్టర్‌కు దేవస్థానం అధికారులు కొండపైన శ్రీనివాస నిలయం గెస్ట్‌హౌస్‌ను ఇంజనీరింగ్‌ విభాగ ఏఈ ఆదిత్య రిఫరెన్స్‌తో నిబంధనలకు విరుద్ధంగా (ఉచితంగా) కేటాయించారు. కాంట్రాక్టర్‌ ఆ కాటేజీలో ఈనెల 25 ఉదయం వరకు ఉ న్నారు. అయితే ఈ రెండు రోజుల అద్దె సొమ్ము రూ.6,574 దేవస్థానానికి జమ కాలేదు. దేవస్థానం కాటేజీలను ఎవరికీ ఉచితంగా ఇవ్వరని, కాంట్రాక్టర్‌కు ఎలా కేటాయించారని స్థానికులు ప్రశ్నిస్తున్నా రు. అందులోనూ ఆరోపణలు ఎదుర్కొంటున్న పా త కాంట్రాక్టర్‌కు ఈ సౌకర్యం కల్పించడం వెనుక ఆంతర్యం ఏమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

జమ చేస్తారా.. ఎగ్గొడతారా? : కాటేజీ అద్దె సొమ్ము ను దేవస్థానానికి కాంట్రాక్టర్‌ కడతాడా.. లేక ఇంజనీరింగ్‌ విభాగ అధికారులు చెల్లిస్తారా అన్న దానిపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. దీనిపై అధికారులు ఏ విధంగా స్పందిస్తారన్నది వేచి చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement