సమగ్ర శిక్ష కాంట్రాక్ట్‌ ఉద్యోగుల ధర్నా | - | Sakshi
Sakshi News home page

సమగ్ర శిక్ష కాంట్రాక్ట్‌ ఉద్యోగుల ధర్నా

Oct 1 2026 9:45 AM | Updated on Oct 1 2026 9:45 AM

సమగ్ర శిక్ష కాంట్రాక్ట్‌ ఉద్యోగుల ధర్నా 25 మద్యం షాపులకు టెండర్ల ప్రక్రియ నేడు పింఛన్ల పంపిణీ నేడు తేలనున్న విలీన పంచాయితీ ఫెన్సింగ్‌లో ప్రతిభ

భీమవరం: సమగ్ర శిక్ష పరిధిలోని కాంట్రాక్ట్‌ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని బుధవారం స్థానిక కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ఆర్ట్‌, క్రాఫ్ట్‌ హెల్త్‌ అండ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ పార్ట్‌టైమ్‌ ఇన్‌స్ట్రక్టర్స్‌ ఫెడరేషన్‌ జిల్లా అధ్యక్షుడు బి.శ్రీనివాస్‌ మాట్లాడుతూ కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన 14 ఏళ్లుగా పనిచేస్తున్న తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఉద్యోగ భద్రత,కనీస వేతనాలు, సెలవులు, సంక్షేమం వంటి ప్రయోజనాలు లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. తమ ను విద్యాశాఖలో విలీనం చేసి సర్వీసును క్రమబద్ధీకరించాలని డిమాండ్‌ చేశారు. అలాగే పీటీఐ ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ పాలసీని అమలుచేసి ఎస్‌జీటీ స్కేల్‌ ప్రకారం వేతనాలు ఇవ్వాలని, డిప్యూటేషన్‌ విధానాన్ని రద్దు చేసి నిర్దేశిత విధి సమయాలకే పరిమితంగా విధు లు కేటాయించాలన్నారు. జిల్లా కార్యదర్శి పి. సుబ్బారావు మాట్లాడుతూ తమకు పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచి రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ కల్పించాలని, హెల్త్‌కార్డు, ఈపీఎఫ్‌, ఈఎస్‌ఐ వంటి సౌకర్యాలు కల్పించాలన్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డీఆర్వోకు అందజేశారు. ఫెడరేషన్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ పీవీ నాగబ్రహ్మం, కోశాధికారి టీవీఎన్‌ఎస్‌ మూర్తి, ఉపాధ్యక్షుడు టి.చినబాబు తదితరులు పాల్గొన్నారు.

భీమవరం: జిల్లాలో రెన్యువల్‌ కాని మద్యం దుకాణాలకు లైసెన్స్‌ కేటాయింపునకు సంబంధించి ఒక్కో షాపునకు 10 దరఖాస్తులు తగ్గకుండా కృషి చేయాలని ఎకై ్సజ్‌ శాఖ నోడల్‌ అధికారి బి.అరుణ్‌రావు అన్నారు. భీమవరం ఎకై ్సజ్‌ శాఖ కార్యాలయంలో బుధవారం ఆయన సమావేశం నిర్వహించారు. జిల్లాలో 25 మద్యం షాపులకు టెండర్ల ప్రక్రియ నిర్వహించాల్సి ఉందన్నారు. స్టేషన్ల వారీగా భీమవరం పరిధిలో 9, ఆకివీడులో 6, తణుకులో 5, నరసాపురంలో 3, తాడేపల్లిగూడెంలో రెండు షాపులకు లాటరీ తీయాల్సి ఉందన్నారు. డిప్యూటీ కమిషనర్‌ బి.శ్రీలత, అసిస్టెంట్‌ కమిషనర్‌ ఎన్‌.ప్రభుకుమార్‌, జిల్లా అధికారి బి.సుబ్బారావు పాల్గొన్నారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌): జిల్లాలో ఎన్టీఆర్‌ సామాజిక భరోసా పింఛన్లను గురువారం పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. 2,19,185 మంది లబ్ధిదారులకు రూ.95.38 కోట్లను పంపిణీ చేస్తామన్నారు.

పాలకొల్లు సెంట్రల్‌: జిల్లాలో విలీన గ్రామాల ప్రక్రియతో పలువురు కోర్టును ఆశ్రయించడంతో తాడేపల్లిగూడెం, పాలకొల్లు, భీమవరం, తణుకు పట్టణాల్లో మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహణ జరగలేదు. ఈ ప్రక్రియపై గురువారం కోర్టులో భవితవ్యం తేలనున్నట్టు సమాచారం. రాజకీయ నాయకులు ముఖ్యంగా పట్టణ ప్రజ లు ఎన్నికల నిర్ణయంపై తీర్పు కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఆశావహులు తీర్పు కోసం పడిగాపులు కాస్తున్నారు.

భీమవరం: కొవ్వాడకి చెందిన ఇందుకూరి శశి కుమార్‌వర్మ కుమారుడు చరణ్‌వర్మ ఫెన్సింగ్‌ లో ప్రతిభ చూపుతున్నాడు. ఇటీవల జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో బ్రాంజ్‌ మెడల్‌ సాధించాడు. అలాగే 2025 స్టేట్‌ లెవెల్‌ సిల్వర్‌ మెడల్‌, 2026 డిస్ట్రిక్ట్‌ లెవెల్‌ బ్రాంజ్‌ మెడల్‌, 2026 స్టేట్‌ లెవెల్‌ సిల్వర్‌ మెడల్‌ పొందాడు. ఈ సందర్భంగా భీమవరం క్యాంపు కార్యాలయంలో బుధవారం శాసనమండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు చరణ్‌వర్మను అభినందించారు. అంతర్జాతీయ స్థాయి లో రాణించాలని ఆకాంక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement