కలవరిపాటు | - | Sakshi
Sakshi News home page

కలవరిపాటు

Sep 27 2026 1:28 AM | Updated on Sep 27 2026 1:28 AM

పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌

న్యూస్‌రీల్‌

ఎర్రకాలువ ముంపుపై చర్యలేవి?

పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌
పెదవేగి పోలీస్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న పోలీస్‌ కానిస్టేబుళ్ల (ఎస్‌సీటీపీసీ) పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ ఘనంగా నిర్వహించారు. 8లో u
తీవ్ర వాయుగుండం ప్రభావంతో మూడు రోజులపాటు కురిసిన భారీ వర్షాలు సార్వా వరి పైరును నిండా ముంచేశాయి. డ్రెయినేజీ వ్యవస్థ అధ్వానంగా ఉండటం, ముంపు బయటకు వెళ్లే మార్గం లేకపోవడంతో చేలన్నీ నీళ్లలోనే నానుతున్నాయి. దీంతో పైరు కుళ్లిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో సుమారు 5 వేల ఎకరాలకు పైగా, ఏలూరు జిల్లాలో 5,380 ఎకరాల్లో వరి చేలు ముంపు బారినపడినట్టు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.

ఆదివారం శ్రీ 27 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

భీమవరం: పశ్చిమగోదావరి జిల్లాలోని 20 మండలాల్లో సుమారు 2.25 లక్షల ఎకరాల్లో సార్వా సాగు చేస్తున్నారు. జిల్లాలోని 107 గ్రామాల్లో చేలు ముంపులో ఉన్నాయి. ముందుగా నాట్లు వేసిన ప్రాంతాల్లో వరి పైరు ఈనిక, పొట్టదశలో, నాట్లు ఆలస్యమైన మెరక ప్రాంతాల్లో పైరు పిలకలు తొడిగే దశలో ఉన్నాయి.

వేలాది ఎకరాల్లో..

తీవ్ర వాయుగుండంతో ఈనెల 23 నుంచి మూడు రోజుల పాటు ఎడతెరపి లేకుండా వర్షాలు కురిశాయి. పశ్చిమగోదావరి జిల్లాలో దాదాపు 3,720 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. 23న 728 మి.మీ., 24న 1,794 మి.మీ., 25న 1,199 మి.మీ. వర్షపాతం నమోదయ్యింది. జిల్లాలో అత్యధికంగా తాడేపల్లిగూడెం మండలంలో 1,500 ఎకరాలు, అత్తిలిలో 650, తణుకులో 600, ఇరగవరంలో 375, పెనుమంట్ర మండలంలో 300 ఎకరాలు వరిచేలు మునిగినట్టు వ్యవసాయశాఖ ప్రాఽథమికంగా అంచనా వేసింది. అయితే ముంపు విస్తీర్ణం మరింత ఉంటుందని రైతు లు అంటున్నారు. శుక్ర, శనివారాల్లో ఎండ తీవ్రత పెరిగినా చేలల్లోని నీరు బయటకు వెళ్లడం లేదని, డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటమే కారణమని అంటున్నారు. మరో రెండు రోజులు ఇలా ఉంటే పైరు కుళ్లిపోతుందని వాపోతున్నారు.

ఉద్యాన పంటలకు నష్టం

తాడేపల్లిగూడెం: భారీ వర్షాలతో రాష్ట్రంలో 286 గ్రామాల్లో ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయ వీసీ కె.ధనుంజయరావు అన్నారు. శనివారం ఆయన వివరాలు వెల్లడించారు. 12 జిల్లాల్లోని 84 మండలాల్లో పంటలు దెబ్బతిన్నాయన్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం సుమారు 1,392 హెక్టార్లలో తో టలు మునిగి, 4,598 మంది రైతులకు సుమారు రూ.28.09 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. వరద నీ రు తగ్గుముఖం పట్టిన వెంటనే చేపట్టాల్సిన యా జమాన్య చర్యలు, జాగ్రత్తల గురించి రైతులకు ఉ ద్యాన వర్సిటీ ద్వారా అందిస్తామన్నారు. పరిశోధనా శాస్త్రవేత్తలు, ఉద్యాన శాస్త్రవేత్తలు రైతులకు అందుబాటులో ఉంటారన్నారు.

తాడేపల్లిగూడెం: స్థానిక ప్రజాప్రతినిధి అసెంబ్లీలో ఎర్రకాలువ ముంపు, రైతుల కష్టాల గురించి ప్రస్తావించారు.. రికార్డుల కెక్కింది.. సరే.. క్షేత్రస్థాయిలో రై తులను ఆదుకునేందుకు ముందస్తు చర్యలేవి అంటూ వైఎస్సార్‌సీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ కన్వీనర్‌ వడ్డి రఘురాం ప్రశ్నించారు. శనివారం తాడేపల్లిగూడెం మండలంలోని నందమూరు, మారంపల్లి, జగన్నాథపురం, మాధవరం, దండగర్రలో ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. నందమూరు అక్విడెక్ట్‌ వద్ద గుర్రపుడెక్క నివారణకు చేపట్టిన పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్నేళ్లుగా ఎర్రకాలువ ముంపు బెడద ఉంది, వర్షాకాలంలో వాగులు పొంగిపొర్లి ఎర్రగంగ ముంచేస్తోందన్నారు. ప్రభుత్వం దీని నివారణకు నిర్మాణాత్మక కార్యక్రమాలు చేపట్టడం లేదని, గండ్లు పడటం, తూతూమంత్రంగా పనులతో మమ అనిపిస్తున్నారని విమర్శించారు. సుమారు రూ.2 కోట్లతో ఎర్రకాలువ గండ్లు పూడ్చారు. అయినా ప్రయోజనం లేదన్నారు. అసెంబ్లీలో మైకులు పట్టుకుని మాట్లాడటమే కానీ క్షేత్రస్థాయిలో కార్యాచరణ ఉండదా అని ప్రశ్నించారు. సాగు, పొలాల ప రిస్థితిపై అధికారులతో ముందస్తు సమావేశాలు నిర్వహించారా? అని నిలదీశారు. రైతులు ఎకరాకు రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టారని, ముంపు నీరు ఇలానే ఉంటే పంట మొత్తం కుళ్లిపోతుందన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పంటల బీమాతో ఆదుకుంటే.. కూటమి ప్రభుత్వం పథకాన్ని ఎత్తేసిందని, దీంతో రైతులు నిండా మునిగిపోతున్నారన్నారు. మూడు రెట్లు పరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే రైతుల తరఫున ఉద్యమిస్తామని హెచ్చరించారు. మండల పార్టీ అధ్యక్షుడు చిట్టూరి బాపన్న, సీనియర్‌ నాయకులు సతీష్‌, దానయ్య తదితరులు ఉన్నారు.

వాయుగండం

రైతులను నిండా ముంచిన భారీ వర్షాలు

ఉమ్మడి జిల్లాలో 10 వేల ఎకరాలకు పైగా ముంపులో..

రైతులు రక్షణ చర్యలుతీసుకోవాలంటున్న వ్యవసాయశాఖ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement