నాణ్యత డొల్ల.. రోడ్లు గుల్ల | - | Sakshi
Sakshi News home page

నాణ్యత డొల్ల.. రోడ్లు గుల్ల

Sep 28 2026 7:33 AM | Updated on Sep 28 2026 7:33 AM

భీమవరం(ప్రకాశం చౌక్‌): గుంతలు లేని రోడ్ల నిర్మాణమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చేపట్టిన పనులు, మరమ్మతుల్లో నాణ్యతా ప్రమాణాలు పూర్తిగా మృగ్యమయ్యాయి. పనులు పూర్తి చేసిన రెండు, మూడు నెలలకే రోడ్లు మళ్లీ యథాస్థితికి చేరుకున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు నాసిరకం పనుల బండారం బయటపడింది. రహదారులను బాగు చేశామని ప్రభుత్వం చెబుతున్న మాటలు క్షేత్రస్థాయిలో నీటిమూటలయ్యాయి.

అధికారుల నిర్లక్ష్యం.. కాంట్రాక్టర్ల నిర్వాకం

రహదారుల నిర్మాణం, మరమ్మతులు నాసిరకంగా జరుగుతున్నా సంబంధిత ఆర్‌అండ్‌బీ అధికారులు కన్నెత్తి చూడలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నాణ్యతను పర్యవేక్షించాల్సిన అధికారులు కాంట్రాక్టర్లకు బిల్లులు చేయడంలో చూపించిన శ్రద్ధ పనుల నాణ్యతపై చూపించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులకు తెలిసే ఈ అక్రమాలు జరుగుతున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. కాంట్రాక్టర్లు అరకొర మెటీరియల్‌తో నాసిరకం పనులు చేసి ప్రజాధనాన్ని జేబుల్లో నింపుకుంటున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాహనదారులు ఎదుర్కొంటున్న నరకయాతనను, రోడ్ల దుస్థితిని యువత సోషల్‌ మీడియా ద్వారా ఎండగడుతున్నారు. రెండు నెలల క్రితం జి ల్లాలోని ప్రధాన రోడ్లను పూర్తిస్థాయిలో పునర్నిర్మించకుండా, కేవలం గుంతలు పూడ్చే (ప్యాచ్‌ వర్క్‌) పనులకే పరిమితమయ్యారు. దీంతో జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి రహదారులు అధ్వానంగా మారాయి.

మాయ‘దారి’ మరమ్మతులు

రెండు నెలలకే మళ్లీ గోతులు

భారీ వర్షాలతో మరింత అధ్వానంగా..

రాష్ట్ర, జిల్లా రహదారులపై ప్రయాణం భయం భయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement