వైకల్యం అడ్డంకి కారాదు | - | Sakshi
Sakshi News home page

వైకల్యం అడ్డంకి కారాదు

Sep 28 2026 7:33 AM | Updated on Sep 28 2026 7:33 AM

వైకల్యం అడ్డంకి కారాదు లాయర్స్‌ సంఘ ఎన్నిక ప్రపంచ పర్యాటక దినోత్సవం నేడు యథావిధిగా పీజీఆర్‌ఎస్‌

భీమవరం : వైకల్యం చదువుకు అడ్డంకి కారాదని, ఎట్టి పరిస్థితిల్లోనూ చదువును ఆపవద్దని కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి సూచించారు. భీమవరం డీఎన్నార్‌ కళాశాలలో దివ్యాంగులు, ట్రా న్స్‌జెండర్లు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, జిల్లా డెఫ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆది వారం అంతర్జాతీయ సైన్‌ లాంగ్వేజ్‌ దినోత్స వం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ బధిరులకు సమాన హక్కులు, అవకాశాలు కల్పించడం, సాంకేతిక (సైన్‌) భాష ప్రాముఖ్యతపై అవగాహన పెంచడమే ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యం అన్నారు. జిల్లాలోని బధిరులు అందరూ సైన్‌ లాంగ్వేజ్‌ నేర్చుకోవాలన్నారు. ఐదు గురు బధిరులకు స్మార్ట్‌ఫోన్లను అందజేశారు. డెఫ్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ ఆర్‌.ఉమామహేశ్వరరావు, జనరల్‌ సెక్రటరీ తోట రాము, సాంఘిక సంఘసంస్కర్త చెరుకూరి రంగస్వామి తదితరులు పాల్గొన్నారు.

భీమవరం: ఆల్‌ ఇండియా లాయర్స్‌ యూనియన్‌ ఉభయగోదావరి జిల్లాల నూతన అ ధ్యక్ష, కార్యదర్శులుగా పుట్టా వేణుగోపాలచౌదరి, కామన మునిస్వామి ఎన్నికయ్యారు. ఆ దివారం భీమవరంలో సంఘ మహాసభ నిర్వహించారు. నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్ష, కార్యదర్శులతో పాటు ఉపాధ్యక్షులు గా దిగుపాటి రాజగోపాల్‌, మేక ఈశ్వరయ్య, కౌరు వెంకటేశ్వర్లు, సహాయ కార్యదర్శులుగా రామాని కాస్ట్రో, పి.శ్రీనివాసు, పీవీపీ లక్ష్మి, కో శాధికారిగా కట్టా సత్యనారాయణ, 12 మంది కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. ప్రభుత్వం న్యాయవాదులకు రక్షణ చట్టం అమలు, జూనియర్‌ న్యాయవాదులకు రూ. 10 వేలకు ఉపకార వేతనం పెంచాలని తీర్మానించారు.

భీమవరం : జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఆదివారం ప్రపంచ పర్యాటక దినోత్సవం నిర్వహించారు. జిల్లా పర్యాటక అధికారి ఎ.వెంకట అప్పారావు మాట్లాడుతూ పర్యాటక అభివృద్ధిలో యువత పాత్రపై అవగాహన కల్పించారు. డిజిటల్‌ క్యాంపెయిన్‌, వర్క్‌షాప్‌ ని ర్వహణ, ఏఐ, సాంకేతిక పరిజ్ఞానంపై విరించా రు. కళాశాల ప్రిన్సిపాల్‌ బీఆర్‌కే వర్మ, డీన్‌ ఆఫ్‌ స్టూడెంట్స్‌ అఫైర్స్‌ హరీష్‌ వర్మ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌): జిల్లా కలెక్టరేట్‌తో పాటు మండల, డివిజన్‌ కేంద్రాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమం నిర్వహించనున్నట్టు కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి తెలిపారు. అలాగే రెవెన్యూ క్లినిక్‌ కూడా నిర్వహిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement