● ఉండ్రాజవరంలో పోలీసులు బ్రిటీష్ పాలనను చూపించారు
● ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ధ్వజం
పోలీసుల వేధింపులు ఆగలేదని, తమపై రౌడీషీట్ తెరుస్తామంటూ బెదిరిస్తున్నారని అన్నారు. ఇందుకేనా జనసేనను మా ఓట్లు వేసి గెలిపించామని ప్రశ్నించారు. కాపు నాయకులు చీర్ల రాధయ్య, కేఆర్‌పీఎస్ నాయకులు రావి శ్రీనివాసరావు, కాకిలేటి హరినాథ్, కాచ్చెర్ల ప్రసాద్, తోట రామకృష్ణ, బండా రు అచ్చిబాబు, పసుపులేటి ఇంద్ర, రుద్రా ధనరాజు, వలవల శ్రీధర్‌నాయుడు, ఉండ్రాజవరం నుంచి వచ్చిన కాపు యువత పాల్గొన్నారు.
కేఆర్‌పీఎస్ బహిరంగ లేఖ
కాపు రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో కాపు నాయకులు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌కు బహిరంగ లేఖ విడుదల చేశారు. ఉండ్రాజవరంలో రంగా విగ్రహ ఏర్పాటును దురుద్దేశంతో వివాదాస్పదం చేసి రెండు సామాజిక వర్గాల మధ్య వివాదాన్ని టీడీపీ నాయకులు రాజేశారని లేఖలో కేఆర్‌పీఎస్ నాయకులు వివరించారు. వారు కాపు సమాజాన్ని, రంగా అభిమానులను రెచ్చగొట్టే రీతిలో మాట్లాడారని, ‘రూ.5 లక్షలు ఇస్తాం ఊరి చివర పెట్టుకోండి’ అని కాపు జాతి మనోభావాలు దెబ్బతినేలా మా ట్లాడుతున్నారని, తమపై కుల వివక్ష చూపుతున్నారని, సమస్యను సామరస్యంగా పరిష్కరిస్తారా? లేనిపక్షంలో చలో ఉండ్రాజవరం పిలుపు ఇవ్వమంటారా అంటూ కేఆర్‌పీఎస్ గౌరవ చైర్మన్ దాసరి రా ము, చైర్మన్ కజా సత్యనారాయణ, వర్కింగ్ చైర్మన్ మాసాబత్తుల శ్రీనివాస్, రాష్ట్ర కన్వీనర్ రావి శ్రీనివాస్, రాష్ట్ర కో–చైర్మన్స్ వలవల శ్రీధర్‌నాయుడు, తాడి నానాజీ, బండారు అచ్చిబాబు, రాష్ట్ర కోఆర్డినేటర్స్ జీటీ రామారావు, వానపాముల నాగబాబు, సమతం రాము లేఖను విడుదల చేశారు.
తణుకు అర్బన్: ఉండ్రాజవరంలో కాపుల ఆరాధ్య దైవం వంగవీటి రంగా విగ్రహ ఏర్పాటులో పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత దుర్మార్గమని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. రంగా అభి మానులు, యావత్ కాపు జాతి మనోభావాలు దె బ్బతినేలా తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు ని యోజకవర్గం ఉండ్రాజవరంలో రంగా విగ్రహ ఏర్పాటుపై కక్షపూరితంగా పోలీసులు వ్యవహరించారని మండిపడ్డారు. సోమవారం పశ్చిమగోదావరి జిల్లా తణుకు కాపు కల్యాణ మండపంలో కాపు రిజర్వేషన్ పోరాట సమితి (కేఆర్‌పీఎస్) ఆ ధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏడాదిగా రంగా విగ్రహ ఏర్పాటుకు కృషి చేస్తున్నా ఇబ్బందులు పెడుతున్న నేపథ్యంలో కాపు యువత చేసిన ప్రయత్నాన్ని పోలీసులు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలపై నలుపు రంగు గుడ్డలు వేసి విగ్రహాన్ని తొలగించాల్సిన దుస్థితికి వచ్చారంటే మనం ఎక్కడ ఉన్నామో అర్థం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. స్థానికంగా కొందరు నాయకులు రంగాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కాపు జాతి దౌర్భాగ్యమని, ఓట్ల కోసం రంగా నామస్మరణ చేస్తూ ఆయన విగ్రహానికి దండలు వేస్తారని, అయితే విగ్రహ ఏర్పాటుకు ఎందుకు అడ్డం పడుతున్నారని ప్రశ్నించారు. రంగాను రాజకీయంగా కాకుండా సామాజిక కోణంగా చూడాలని, ఇటువంటి విషయాల్లో రాజకీయాలు కాదని పుట్టిన కులం తరఫున తాను వ చ్చానని స్పష్టం చేశారు. విగ్రహాన్ని ఊరి చివర పెట్టుకోమనే సలహాలు కొందరు ఇస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లోనూ విగ్రహం తొలగించిన చోటు కానీ లేదంటే రంగాపై అభిమానంతో ముందుకు వచ్చిన స్థానిక కాపు నేత కోటిపల్లి తాతారావు చూపిన స్థలంలోనైనా పెట్టించాలన్నారు. లేకుంటే తమ నిర్ణయాలు తమకు ఉంటాయని హెచ్చరించారు. విగ్రహ తొలగింపులో భాగంగా కాపుజాతిపై పోలీసులు చేసిన లాఠీచార్జ్ అత్యంత దుర్మార్గమని, డీ ఎస్పీ, సీఐ, ఎస్సైలు వ్యవహరించిన తీరు అత్యంత హేయమని, అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని తోట త్రిమూర్తులు హితవు పలికారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కందుల దుర్గేష్ ఈ సమస్యపై సానుకూలంగా స్పందించి సామరస్యంగా పరిష్కరించాలని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కోరారు.
పోలీసుల వేధింపులు ఆగలేదు
ఉండ్రాజవరానికి చెందిన కాపు నేత కటకం రామకృష్ణ మాట్లాడుతూ స్థానిక గాంధీ బొమ్మ సెంటర్‌లో ఏడాది క్రితమే రంగా విగ్రహ ఏర్పాటుకు కాంక్రీటు దిమ్మను ఏర్పాటుచేసుకున్నామని, పంచాయతీ అనుమతులకు ఇబ్బందులు పెడుతున్న నేపథ్యంలో కాపు యువత విగ్రహం ఏర్పాటుచేశారని, గంట వ్యవధిలోనే విగ్రహాన్ని పోలీసులు తొలగించారన్నారు. తమ సామాజికవర్గ ఓట్లతో గెలిచి తమపై లాఠీచార్జ్ చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. డీఎస్పీ సైతం తమతో వాగ్వాదానికి దిగారన్నారు. మా స్థలంలో విగ్రహాన్ని పెట్టుకునేందుకు కూడా అ డ్డుచెప్పడం, ఊరి చివర పెట్టుకోమని చెప్పడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఇప్పటికీ తమపై


