భీమవరం (ప్రకాశంచౌక్): ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీల పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి ఆదేశించారు. సో మవారం కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్‌లో భాగంగా ప్ర జల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రతి ఫిర్యాదును సంబంధిత అధికారులు బాధ్యతగా తీసుకుని ఫి ర్యాదుదారులకు సంతృప్తికరమైన పరిష్కారం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. పీజీఆర్‌ఎస్‌లో 161, రెవెన్యూ క్లినిక్‌లో 42 అర్జీలు స్వీకరించారు. జేసీ కేఆర్ కల్పశ్రీ, డీఆర్వో పి.గ్లోరియా, కేఆర్‌సీసీ డిప్యూటీ కలెక్టర్ బి.పెంచల ప్రభాకర్, పీజీఆర్‌ఎస్ జిల్లా ప్రత్యేక అధికారి వై.దోసిరెడ్డి, డ్వామా పీడీ కేసీహెచ్ అప్పారావు పాల్గొన్నారు.
లంక గ్రామాల్లో అప్రమత్తం : గోదావరి వరద కారణంగా జిల్లాలోని లంక గ్రామాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని, ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
బీఎస్పీ నాయకుల నిరసన : కూటమి పాలనలో 27 మంది దళితుల మరణాలపై న్యాయం చేయాలంటూ బీఎస్పీ నాయకులు కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపి కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో దళితులపై దాడులు, దౌర్జన్యాలు అత్యా చారాలు, హత్యలు పెరిగిపోయాయన్నారు. జిల్లా అధ్యక్షుడు కొల్లాబత్తు ఏలియా రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి కాటూరి కరుణాకర్ పాల్గొన్నారు.
అర్జీల్లో కొన్ని..
● భీమవరం ఫైర్‌స్టేషన్ రోడ్డుపై ఇటుకలతో భా రీగా లోడ్ చేసిన ట్రాక్టర్లను నిలిపివేస్తుండటంతో రాకపోకలకు ఇబ్బందిగా ఉందని మొహమ్మద్ అఖిల్ అనే వ్యక్తి కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.
● చిట్టీల పేరుతో రూ.2 కోట్లకు పైగా ఎగనామం పెట్టి దాసరి వెంకట గోపాలకృష్ణమూర్తి అనే వ్యక్తి పరారయ్యాడని అనాకోడేరు గ్రామానికి చెందిన పలువురు కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు.
పరిశ్రమలకు ప్రోత్సాహం
జిల్లాలో పరిశ్రమల స్థాపనపై అవగాహన కల్పించేందుకు ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో పరిశ్రమల మార్గదర్శక కేంద్రం నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ నాగరాణి చెప్పారు. ఔత్సాహికులకు రుణ మంజూరు చెక్కులను అందజేశారు.
కలెక్టర్ సీహెచ్ నాగరాణి


