సాక్షి ప్రతినిధి, ఏలూరు: తొందరగా నిధుల గోల్‌మాల్ వ్యవహారం ముగిద్దాం.. బడాబాబు రూ.70 లక్షలు వాడుకున్నారు.. ఆయన కొద్దిరోజుల్లో కట్టేస్తాడు.. మొత్తం ఐదుగురు ఉద్యోగులను పాత్రధారులుగా తేల్చి రూ.1.34 కోట్లు గోల్‌మాల్ జరిగినట్టు తేలింది.. అనవసరంగా దీనిని ఎక్కువ రోజు లు సాగదీస్తే గతేడాది, అంతకు ముందు సంవత్సరాలది కూడా తవ్వి బయటకు తీస్తారు.. రూ.2.50 కోట్లకుపైనే పాతవి తేలే ప్రమాదం ఉంటుంది. అందుకని ఐదుగురు ఉద్యోగులు తలా రూ.27.50 లక్షల చొప్పున జనవరి నెల పోస్ట్ పెయిడెడ్ చెక్కు లు ఇచ్చేయండి.. నగదు రికవరీ చేశామని ఫైల్ క్లోజ్ చేసేద్దాం.. ఇది ఏలూరు నగరపాలక సంస్థ ఉన్నతాధికారి ఉద్యోగులకు పెట్టిన ప్రతిపాదన.
తిరగబడ్డ ఉద్యోగి
గోల్‌మాల్ వ్యవహారంలో ఐదుగురు సిబ్బందిపై వేటు పడగా ఉన్నతాధికారి తలా రూ.27.50 లక్షల మొత్తంతో వచ్చే ఏడాది జనవరి (పోస్టు పెయిడెడ్) చెక్కులు ఇస్తే రికవరీ చేశామని, అవకతవకలను సరిదిద్దామని చార్జీ మెమోలతో వ్యవహారాన్ని ము గించేయవచ్చని చెప్పగా ఒక ఉద్యోగి తిరగబడ్డాడు. ‘మాకు ఎలాంటి సంబంధం లేదు.. మేం వాడుకున్నది లేదు.. అన్నీ మీకు తెలుసు.. పెద్దవాళ్లు ఏం చేశారో కార్పొరేషన్ అంతా తెలుసు.. నన్ను వేధిస్తే ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయిస్తా’ అని హెచ్చరించడంతో సెటిల్‌మెంట్ అర్ధాంతరంగా ముగిసింది.
పొలిటికల్ కనుసన్నల్లో..
ఏలూరు నగరపాలక సంస్థలో ప్రజల సొమ్ము రాజకీయ నేతలు 70 శాతం , ఉద్యోగులు మరో 30 శాతం తినేశారు. పూర్తిగా పొలిటికల్ కనుసన్నల్లో జరిగిన దందా కావడంతో ఉద్యోగులుధీమాగా వ్యవహరించా రు. సస్పెన్షన్‌కు గురికావడం, శాఖాపరమైన విచారణ తో పాటు పోలీస్ విచారణ కూడా ప్రారంభం కా వడంతో తీవ్ర అలజడి రేగింది. ఉన్నతాధికారి పొలిటికల్ సూచనలతో నిధుల గోల్‌మాల్ ఫైల్‌ను మూ సివేసే దిశగా అడుగులు వేశారు.
ఏఐ సృష్టించిన చిత్రం
రూ.1.34 కోట్లు గోల్‌మాల్‌గా గుర్తింపు
ఐదుగురు ఉద్యోగులు తలా రూ.27.50 లక్షలు కట్టండి
సెటిల్‌మెంట్ దిశగా ఏలూరు కార్పొరేషన్ నిధుల గోల్‌మాల్


