వేగంగా పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

వేగంగా పరిష్కరించాలి

Sep 29 2026 1:09 AM | Updated on Sep 29 2026 1:09 AM

వేగంగా పరిష్కరించాలి 3న ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌ ఎకై ్సజ్‌ ఆదాయం రూ.369.62 కోట్లు లింగ నిర్ధారణ పరీక్షలు నేరం ఉద్యాన వర్సిటీకి ‘స్కోచ్‌’ అవార్డు

భీమవరం: ప్రజాసమస్యలపై త్వరితగతిన స్పందించి నిర్ణీత గడువులోగా చట్టపరిధిలో శాశ్వత పరిష్కారం చూపాలని జిల్లా పోలీసు అధికారులను అడిషినల్‌ ఎస్పీ డి.విశ్వనాథ్‌ ఆదేశించారు. సోమవారం భీమవరం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం సంబంధిత అధికారులతో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. బాధితులకు భరోసా కల్పించాలన్నారు. జిల్లా స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ కేవీవీఎన్‌ సత్యనారాయణ పాల్గొన్నారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌): తణుకు ఎస్‌కేఎస్‌డీ మహిళా కళాశాలలో వచ్చేనెల 3న మెగా ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌ నిర్వహించనున్నట్టు కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి తెలిపారు. కలెక్టరేట్‌లో సో మవారం డ్రైవ్‌ పోస్టర్లను ఆవిష్కరించారు. సు మారు 13 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని, 800 లకు పైగా ఉద్యోగావకాశాలు కల్పిస్తారన్నారు. మరిన్ని వివరాలకు సెల్‌ 7330803719, 9618560188లో సంప్రదించాలన్నారు. జేసీ కల్పశ్రీ, డీఆర్వో గ్లోరియా, కేఆర్‌ఆర్‌సీ డిప్యూటీ కలెక్టర్‌ బీపీ పెంచల ప్రభాకర్‌, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పి.లోకమాన్‌ తదితరులు పాల్గొన్నారు.

భీమవరం: గత మూడు నెలల్లో జిల్లాలో 115 మద్యం బెల్ట్‌షాపుల కేసు లు నమోదు చేసినట్లు ప్రొహిబిషన్‌, ఎకై ్సజ్‌ జిల్లా అధికారి బి.సుబ్బారావు సోమవారం ప్రకటనలో తెలిపారు. ఎన్‌డీపీఎల్‌ కేసులు మూడు, బహిరంగంగా మద్యం సేవించిన కేసులు 53, 275 బైండోవర్‌ కేసులు నమోదు చేశామన్నారు. అలాగే జిల్లాలోని ఆరు ఎకై ్సజ్‌ స్టేషన్ల పరిధిలోని 193 మద్యం షాపులు, 28 బార్లు ద్వారా రూ.369.62 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు. జిల్లాలో 175 షాపులకు ఇప్పటివరకు 150 షాపుల రెన్యువల్‌ పూర్తికాగా.. మిగిలిన 25 షాపులకు నోటిఫికేషన్‌ జారీ చేశామన్నారు. 1వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని, 5న కలెక్టరేట్‌లో డ్రా తీస్తామని పేర్కొన్నారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌): జిల్లాలో చట్టవిరుద్ధంగా గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు చేయరాదని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ సీహెచ్‌వీ భారతలక్ష్మి అన్నారు. సోమవారం జరిగిన జిల్లాస్థాయి గర్భస్థ పిండ లింగ నిర్ధారణ కమిటీ సలహా సంఘ సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లాలో స్కానింగ్‌ కేంద్రాలను తరచుగా తనిఖీలు చేయాలని, రికార్డులు, రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. అలాగే స్ట్రింగ్‌ ఆపరేషన్లు నిర్వహించాలని, జిల్లాలో ఆడపిల్లల నిష్పత్తి తక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. స్కానింగ్‌ కేంద్రాల నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. జిల్లా రోగనిరోధక శాఖ అధికారి డాక్టర్‌ దేవసుధాలక్ష్మి, డాక్టర్‌ ఎం.సుబ్బలక్ష్మి, డాక్టర్‌ కె.ప్రవీణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

తాడేపల్లిగూడెం: డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన వర్సిటీకి 2026కి స్కోచ్‌ సిల్వర్‌ అవార్డు దక్కింది. ఈనెల 26న న్యూ ఢిల్లీలోని ఇండియన్‌ హ్యాబిటాట్‌ సెంటర్‌లో జరిగిన 109వ సమ్మిట్‌లో అవార్డు అందుకున్నట్టు సోమవారం వీసీ డాక్టర్‌ కె.ధనుంజయరావు తెలిపారు. దేశంలోనే అత్యున్నత స్వతంత్ర పౌర పురస్కారాల్లో ఒకటిగా నిలిచే స్కోచ్‌ అవార్డు తమ వర్సిటీకి రావడం సంతోషంగా ఉందన్నారు. వర్సిటీ పరిధిలోని ఓనిపెంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తల కృషికి గుర్తింపుగా అవార్డు లభించిందన్నారు. అవార్డు సాధనలో కీలక పాత్ర పోషించిన శాస్త్రవేత్తలను వీసీ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement