జాగ్రత్తలతో ‘హృదయం’ పదిలమే!
కొల్లేరు సమాచారాన్ని అందించాలి
పింఛన్ దరఖాస్తులు
న్యూస్‌రీల్
మంగళవారం శ్రీ 29 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
సాక్షి, భీమవరం: అధికారంలోకి వచ్చిన 27 నెలల తర్వాత ఎట్టకేలకు కూటమి కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు స్వీకరించిన విషయం విదితమే. ఈనెల 7 నుంచి మొదలైన ప్రక్రియ 18తో ముగిసింది. కేవలం తొమ్మిది పనిదినాల్లో జిల్లావ్యాప్తంగా 49,891 దరఖాస్తులు వచ్చాయి. భీమవరం అర్బన్‌లో 3 వేల మందికి పైగా దరఖాస్తు చేసుకోగా తాడేపల్లిగూడెం అర్బన్, రూరల్, యలమంచిలి, నరసాపురం, పాలకొల్లు, మొగల్తూరు, తణుకు అర్బన్, భీమవరం రూరల్ నుంచి రెండు వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి.
కొర్రీలతో కోత
తల్లిదండ్రులు, తనయుల కుటుంబాలకు వేర్వేరు రేషన్‌కార్డులు ఉన్నా హౌస్‌హోల్డ్ మ్యాపింగ్‌ను సాకుగా చూపడంతో చాలామంది అర్హులైన వారు పింఛన్‌కు దరఖాస్తు చేసుకునే వీలులేకుండా పోయింది. హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ నుంచి పేరు తొలగించే ఆప్షన్‌ను చంద్రబాబు సర్కారు హోల్డ్‌లో పెట్టేసింది. దీంతో వీరంతా సచివాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు ఏమీ రాలేదంటూ ఇక్కడి సిబ్బంది చెప్పి పంపిస్తున్నారు. జిల్లా నలుమూలల నుంచి పేదవర్గాల వారు కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్‌కు సైతం వచ్చి వినతులు అందజేస్తున్నారు. తమకు పింఛన్ మంజూరు చేయాలని వేడుకుంటున్నారు.
6,047 దరఖాస్తుల తిరస్కరణ
జిల్లావ్యాప్తంగా వృద్ధాప్య, వింతంతు, దివ్యాంగ తదితర సామాజిక పింఛన్లు కోసం జిల్లావ్యాప్తంగా 49,891 దరఖాస్తులు వచ్చాయి. కాగా వీటిలో 43,793 దరఖాస్తులు అర్హత కలిగినవిగా గుర్తించారు. 6,047 దరఖాస్తులు అనర్హులుగా తేల్చారు. మరో 51 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇదిలా ఉండగా 2024 జూన్ నాటికి జిల్లాలో 2,32,885 మందికి సామాజిక పింఛన్లు ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య 2,19,625కు తగ్గిపోయింది. మృతులు, ఇతర కారణాలతో రెండేళ్లలో జిల్లాలో 13220 పింఛన్లకు కూటమి కోత పెట్టింది. మరోపక్క 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని గద్దెనెక్కిన చంద్రబాబు తర్వాత ఆ ఊసే మరిచారు. 50 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు జిల్లాలో 2.5 లక్షల మంది వరకు ఉండగా వారిలో 70 శాతం మంది అర్హులు ఉంటారని అంచనా. తమకు పింఛన్లు వస్తాయన్న వీరి ఆశలపైనా నీళ్లు చల్లారు.
అర్హులందరికీ ఇస్తారా ?
కొత్త పింఛన్లు కోసం ఊహించని విధంగా లక్షల్లో దరఖాస్తులు వచ్చాయని, అన్ని ఒక్కసారే ఇవ్వడం సాధ్యం కాదంటూ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. వరుసగా మున్సిపల్, పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించాల్సి ఉండటంతో దరఖాస్తుల స్వీకరణ ఎన్నికల స్టంటేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త పింఛన్లు ఎప్పటి నుంచి పంపిణీ చేసేది ఇప్పటివరకు ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడం ఇందుకు బలం చేకూరుస్తోంది. ఈలోపు స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ విడుదలైతే దానిని సాకుగా చూపించి పింఛన్లను పక్కన పెట్టేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఉరుకులు పరుగుల జీవితం, మారుతున్న ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ తగ్గిపోవడం, పొగతాగడం వంటి అలవాట్లు గుండైపె తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. 8లో u
కొల్లేరు వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని వచ్చేనెల 5లోపు సమర్పించాలని పర్యావరణ, అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశించారు. 8లో u
కేటగిరీ దరఖాస్తులు
డప్పు కళాకారులు 469
దివ్యాంగ 5,377
మత్స్యకార 1,894
వృద్ధాప్య 28,619
వితంతు 11,177
ఒంటరి మహిళ 385
చర్మకారులు 523
గీత కార్మికులు 1,003
ట్రాన్స్‌జెండర్ 16
చేనేత 427
భీమవరానికి చెందిన కౌలురైతు పెద్ద కుమారుడికి వివాహం కాగా భార్యాపిల్లలతో కలిసి విజయవాడలో ఉంటున్నారు. ప్రైవేట్ ఉద్యోగి అయిన కుమారుడి జీతం అతడి కుటుంబ అవసరాలకు సరిపోని పరిస్థితి. రెండు కుటుంబాల వారికి వేర్వేరు రేషన్‌కార్డులు ఉన్నా ఉద్యోగిగా తండ్రి హౌస్‌హోల్డ్ మ్యాపింగ్‌లో ఉండటంతో కౌలురైతుకు పింఛన్‌కు అర్హత సాధించలేని దుస్థితి నెలకొంది.
పాలకొల్లు రూరల్ అడవిపాలెంకు చెందిన భవానీ భర్త రెండేళ్ల క్రితం గుండెపోటుతో మృతిచెందాడు. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం. భవానీ కూలిపనికి వెళుతూ కుటుంబాన్ని పోషిస్తోంది. రేషన్‌కార్డు ఉన్నా అత్తింటి హౌస్‌హోల్డ్ మ్యాపింగ్‌లో ఆమె పేరు ఉండటంతో వితంతు పింఛన్ దరఖాస్తు అప్‌లోడ్ కావడం లేదని తెలిపింది. పేరు తొలగించుకుంటే పింఛన్ వస్తుందని అధికారులు చెబుతుండగా అందుకు సంబంధించిన ఆప్షన్‌ను ప్రభుత్వం హోల్డ్‌లో పెట్టడంతో దరఖాస్తు చేసుకోలేకపోయింది. పింఛన్ మంజూరు చేసి తమను ఆదుకోవాలని కోరుతూ సోమవారం ఆమె కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌లో వినతిపత్రం అందజేసింది.
ఆంక్షలు.. అడ్డంకులు
కొత్త పింఛన్లకు హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ కొర్రీలు
ఆన్‌లైన్ కాని దరఖాస్తులు
18తో ముగిసిన గడువు
పీజీఆర్‌ఎస్‌లో పేదల ఫిర్యాదులు
కొత్త పింఛన్ల కోసం జిల్లాలో 49,891 దరఖాస్తులు
ఏఐ సృష్టించిన చిత్రం


