ఎత్తుగడపై మండిపాటు | - | Sakshi
Sakshi News home page

ఎత్తుగడపై మండిపాటు

Sep 26 2026 12:44 AM | Updated on Sep 26 2026 12:44 AM

సామాన్యుడిపై ‘ధరా’ఘాతం ఎత్తుగడపై మండిపాటు ● వాటే విజన్‌.. వాటే థాట్‌..

న్యూస్‌రీల్‌

సామాన్యుడిపై ‘ధరా’ఘాతం
భగ్గుమంటున్న నిత్యావసర సరుకుల ధరలతో మధ్యతరగతి జీవనం అస్తవ్యస్తంగా మారింది. దీంతో కుటుంబ పోషణ కష్టమవుతోంది. 8లో u

శనివారం శ్రీ 26 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

‘‘సంపద సృష్టి తెలిసిన వ్యక్తిని. పేదల కష్టం తెలిసినవాణ్ణి. అందుకే సూపర్‌సిక్స్‌ తెచ్చాం. 18 నుంచి 59 ఏళ్లలోపు ఆడబిడ్డలు ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమందికి నెలకు పదైదు వందలు చొప్పున ఇస్తాం. పరిశ్రమలు తెచ్చి యువతకు ఉద్యోగాలు ఇస్తాం. అంతవరకు నిరుద్యోగభృతిగా నెలనెలా మూడు వేలు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్‌ ఇస్తానని మాట ఇస్తున్నాను. – ఎన్నికల్లో చంద్రబాబు

ఎన్నికల్లో మీకు ఎన్నో హామీలు ఇచ్చాను. వాటిని చేయాలి. కానీ ఖజానా ఖాళీగా కనిపిస్తోంది. ఏమీ లేదక్కడ. – అధికారంలోకి వచ్చాక చంద్రబాబు

సెల్ఫ్‌ డబ్బాకు జనం డబ్బు!

సాక్షి, భీమవరం: బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యా రెంటీ అంటూ ఎన్నికల్లో ఊరూరా ఊదరగొట్టారు. అధికారంలోకి రావడమే ఆలస్యం. 2024 జూన్‌ నుంచే అమలు.. ఇవిగో బాండ్లు అంటూ సూపర్‌సిక్స్‌లో ఏ కుటుంబానికి ఎంత వస్తుందో కరపత్రాలపై రాసి మరీ ఇంటింటీకి ఇచ్చారు. చంద్రబాబు సర్కారు వచ్చి అప్పుడే 28 నెలలవుతోంది. మిగిలింది మరో 32 నెలలు మాత్రమే. ఇప్పటివరకు ఆడబిడ్డ నిధి లేదు, నిరుద్యోగభృతి రాదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్‌ హామీ ఊసేలేదు. డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ రాయితీ పత్తాలేదు. ఆడబిడ్డ నిధి పథకం అందక జిల్లాలో ఇప్పటివరకు అర్హత కలిగిన సుమారు 5,96,313 మంది మహిళలు రూ.2,415 కోట్లు నష్టపోయారు. నెలనెలా ఇస్తామన్న రూ.3 వేల కోసం జిల్లాలోని వేల మంది నిరుద్యోగ యువత ఎదురుచూస్తున్నా రు. కొత్త పింఛన్లు అంటూ దరఖాస్తులు స్వీకరించినా 50 ఏళ్లకే పింఛన్‌ హామీని విస్మరించడం గమనార్హం.

జనం సొమ్ము దోచిపెట్టే స్కెచ్‌

ఖజానా ఖాళీ అంటూ ఎన్నికల హామీలకు ఎగ నామం పెట్టిన చంద్రబాబు సర్కారు తన వారికి జనం సొమ్ము దోచిపెట్టడంలో ఏ మాత్రం తగ్గడంలేదు. ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారం పేరిట ఇప్పుడు కొత్తగా సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల పాలసీని తెచ్చింది.

లక్షకు పైగా ఫాలోవర్స్‌ ఉండి స్వయంగా వీడియో తయారుచేస్తే రూ.15 వేలు, ఫాలోవర్స్‌ 50 వేల నుంచి లక్ష లోపు ఉంటే రూ. 7,500, 25 వేల నుంచి 50 వేల లోపు ఉంటే రూ.5,000, పది వేల నుంచి 25 వేల లోపు ఉంటే రూ.2,500, ప్రభుత్వమే కంటెంట్‌ ఇస్తే రూ.500 నుంచి రూ.1,500 వరకు చెల్లించేందుకు సూత్రప్రాయంగా నిర్ణయించింది. గరిష్టంగా ఒక్కో ఇన్‌ఫ్లుయెన్సర్‌కు నెలకు రూ.1.50 లక్షల వరకు చెల్లించనుంది.

కూటమి స్కెచ్‌

ఐటీడీపీ కార్యకర్తలకు ప్రజల సొమ్ము దోచిపెట్టే ఎత్తుగడ

ప్రభుత్వ ప్రచారానికి సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల పేరిట పక్కా స్కెచ్‌

ఫాలోవర్లను బట్టి రూ.1.5 లక్షల వరకు చెల్లించేలా ప్రతిపాదన

ఆడబిడ్డ నిధి, నిరుద్యోగభృతి, 50 ఏళ్లకే పింఛన్‌, సున్నావడ్డీ హామీలకు ఎగనామం

చంద్రబాబు తీరుపై మండిపడుతున్న ప్రజలు

మోసాలపై

అబద్ధపు ప్రచారం

సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ పేరిట ఐటీడీపీ కార్యకర్తలకు నెలనెలా ప్రజల సొమ్ము దోచిపెట్టే ఎత్తుగడపై జనం మండిపడుతున్నారు. ఎన్నికల హామీల అమలుకు సొమ్ములు లేనప్పుడు అబద్ధాల ప్రచారం చేసుకోవడానికి ఎక్కడివని ప్రశ్నిస్తున్నారు. ఏరు దాటేదాక ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న సామెత చంద్రబాబుకు సరిపోతుందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజాసంక్షేమం కోసం గత ప్రభుత్వం అమలుచేసిన చేయూత, ఆసరా, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం తదితర పథకాలకు నీళ్లొదిలారని, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాలకు రూ.కోట్లల్లో బకాయిలు పెట్టి పేదలను ఇబ్బందులు పెడుతున్నా రని మండిపడుతున్నారు. వాటే విజనరీ.. వాటే థాట్‌ అంటూ సోషల్‌ మీడియాలో చంద్రబాబు సర్కారుపై సైటెర్లు వేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement