హత్యాయత్నం కేసులో.. | - | Sakshi
Sakshi News home page

హత్యాయత్నం కేసులో..

Sep 26 2026 12:44 AM | Updated on Sep 26 2026 12:44 AM

హత్యాయత్నం కేసులో.. ఆడబిడ్డకు దగా నిరుద్యోగులకు మళ్లీ వెన్నుపోటే 50 ఏళ్లకే పింఛన్‌ ఏమయ్యింది?

కాళ్ల మండలం పెదఅమిరంలో ఉపాధ్యాయుడిపై జరిగిన హత్యాయత్నం కేసులో నిందితులను అరెస్ట్‌ చేసినట్టు అడిషినల్‌ ఎస్పీ డి.విశ్వనాథ్‌ తెలిపారు. 8లో u

అధికారంలోకి వచ్చిన వెంటనే సూపర్‌ సిక్స్‌ పథకాలు అమలు చేస్తామని చెప్పి దగా చేశారు. నెలనెలా ఆడబిడ్డ నిధి సొమ్ములు వస్తాయని ఆశించిన మహిళలను చంద్రబాబు వంచించారు. ప్రజలకు ఏం మేలు చేశారని ఇప్పుడు రూ.కోట్లు ఖర్చు చేసి సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లను పెట్టుకుంటున్నారో జవాబు చెప్పాలి.

–కోడే విజయలక్ష్మి, వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు, భీమవరం

కూటమి ప్రభుత్వం ఏర్పడగానే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని, ఇవ్వలేని పక్షంలో నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతిగా ఇస్తామని చంద్రబాబుతో సహా పవన్‌కల్యాణ్‌ ఊదరగొట్టారు. గద్దెనెక్కి రెండున్నరేళ్లు అవుతున్నా ఊసేలేదు.ఏటా జనవరి నెలలో జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని చెప్పి ఇప్పుడేం చేశారు.

– టి.అప్పలస్వామి, ఆల్‌ ఇండియా స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి, తణుకు

ఎన్నికల్లో హామీలు ఇచ్చి మోసం చేయడం చంద్రబాబుకు అలవాటే. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్‌ ఇస్తా మని హామీ ఇచ్చారు. తీరా కూటమి అధికారంలోకి వచ్చాక ఆ హామీ ఊసేలేదు. అధికారం చేపట్టి రెండేళ్లు దాటినా 50 ఏళ్లకే పింఛన్‌ హామీ అమలుకాలేదు.

– కలిగితి జయరాజు, కుముదవల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement