వాయుగుండం నిండా ముంచేను | - | Sakshi
Sakshi News home page

వాయుగుండం నిండా ముంచేను

Sep 26 2026 12:44 AM | Updated on Sep 26 2026 12:44 AM

● వందలాది ఎకరాలు నీటమునక

● నందమూరు అక్విడెక్ట్‌ వద్ద పేరుకుపోయిన తూడు

తాడేపల్లిగూడెం రూరల్‌: తీవ్ర వాయుగుండం ప్రభావంతో కురిసిన వర్షాలకు తాడేపల్లిగూడెం మండలంలో చేలు ముంపు బారిన పడ్డాయి. జగన్నాథపురం, మారంపల్లి, దండగర్ర, నందమూ రు గ్రామాల్లో వందలాది ఎకరాల చేలు ముంపు బారినపడ్డాయి. ఎగువ నుంచి డ్రెయిన్ల ద్వారా వచ్చిన నీరు చేలను ముంచెత్తింది. జగన్నాథపురం, మారంపల్లి గ్రామాల్లోనే 800 ఎకరాలు ముంపు బారినపడినట్టు అంచనా. ఇదిలా ఉండగా కొంగువారిగూడెం ఎర్రకాలువ ప్రాజెక్టు నుంచి వర్షం నీరు విడుదల చేయలేదని అధికారులు తెలిపారు. డ్రెయిన్లు లాగకపోవడం, కొన్నిచోట్ల డ్రెయిన్లు కుచించుకుపోవడం వంటి కారణాలతో సమీప పొలాలను వర్షం నీరు ముంచెత్తిందని రైతులు వాపోతున్నారు. దీంతో వరి చేలు చెరువులను తలపించాయి. ఆయా గ్రామాల్లో ఎక్కువ శాతం కౌలు రైతులు కాగా, ఇప్పటికే ఎకరానికి రూ.25 వేల వరకు పెట్టుబడులు పెట్టామని వాపోతున్నారు. పంట పాడైతే అప్పులు తప్ప మిగిలేది ఏమీ లేదని, ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

అక్విడెక్ట్‌ వద్ద 32 అడుగుల వరద

నందమూరు అక్విడెక్ట్‌ వద్ద 32 అడుగులకు వరద చేరింది. ఇక్కడ వరద పరిస్థితిని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌ పరిశీలించారు. గుర్రపు డెక్క పెరిగిపోవడంతో కానాల నుంచి నీరు లాగడం లేదని, ఇరిగేషన్‌ అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని రైతులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. 24 గంటల్లో 78.4 మి.మీ. వర్షపాతం నమోదైందని తహసీల్దార్‌ ఎం.సునీల్‌కుమార్‌ శుక్రవారం తెలిపారు.

తెగుళ్ల నివారణ మందు పిచికారీ : చేలలో వర్షం నీరు బయటకు పోయే మార్గాలను ఏర్పాటు చేసు కోవాలని, నీరు లాగిన వెంటనే తెగుళ్ల, దోమ నివారణకు వాలిడామైసిన్‌, ప్రొపినోకొనోజోల్‌, హెక్సాకొనొజోల్‌తో పాటు దోమ మందు కలిపి పిచికారీ చేయాలని తాడేపల్లిగూడెం ఇన్‌చార్జి ఏడీఏ వి.నారాయణరావు సూచించారు. తద్వారా పంట పెరుగుదల ఉంటుందన్నారు.

వరి దుబ్బులను చూపిస్తున్న రైతులు

నందమూరు అక్విడెక్ట్‌ వద్ద గుర్రపు డెక్క

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement