ప్రయాణం గోవిందా! | - | Sakshi
Sakshi News home page

ప్రయాణం గోవిందా!

Sep 26 2026 12:44 AM | Updated on Sep 26 2026 12:44 AM

ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమలలోని టీటీడీ సదనం వద్ద, కుంకుళ్లమ్మ ఆలయం సమీపంలోని మలుపులో, నిమ్మకాయల మార్కెట్‌ యార్డు, లక్ష్మీపురంలోని జగన్నాథుని ఆలయం ఆర్చిగేటు వద్ద, గొల్లగూడెం చెరువు, సూర్యచంద్రరావుపేట శివారు, పంగిడిగూడెంలో, భీమడోలు మండలం పొలసానిపల్లి గురుకుల పాఠశాల సమీపంలో రహదారి దెబ్బతింది. విర్డ్‌ ఆస్పత్రి వద్ద స్థానికులు రోడ్డు మధ్యలో ఇసుక మూటను పెట్టగా.. ద్వారకాతిరుమల టీటీడీ సత్రం వద్ద గుంతకు డ్రమ్మును అడ్డుగా ఏర్పాటు చేశారు. వాహనదారులు వాటిని తప్పించుకుని వెళ్లాల్సి వస్తోంది.

కొట్టుకుపోయిన ‘మేకప్‌’

గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఈనెల 5న ‘గ్రామ స్వరాజ్యం సంకల్ప పాదయాత్ర’ పేరుతో నల్లజర్ల నుంచి ద్వారకాతిరుమల వరకు పాదయాత్రగా వచ్చారు. ఈ నేపథ్యంలో అధికారులు ఈనెల 4న గొల్లగూడెం నుంచి ద్వారకాతిరుమల వరకు రోడ్డుపై ఉన్న గోతుల్లో కంకర డస్ట్‌ పోసి హడావుడిగా పూడ్చి, మేకప్‌ చేశారు. అయితే మూడు రోజులుగా కురిసిన ఎడతెగని వానలకు ఆ మేకప్‌ మొత్తం కొట్టుకుపోయింది. గోతులన్నీ మళ్లీ బయటపడటంతో రహదారి దుస్థితి యథాస్థితికి చేరింది.

ప్రమాదాలకు అడ్డుకట్టేది?

ఈ రహదారి నిర్మించినప్పటి నుంచి తరచూ దెబ్బతింటూనే ఉంది. గతేడాది జూన్‌ నుంచి డిసెంబర్‌ వరకు పలుచోట్ల ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. వీటిలో క్షతగాత్రులైన వారిలో ఎక్కువ మంది బైక్‌లపై చినవెంకన్న దర్శనానికి వచ్చేవారే ఉన్నారు. ఈ పరిస్థితిపై అప్పట్లో ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురితం కావడంతో గతేడాది డిసెంబర్‌లో రహదారికి మరమ్మతులు చేపట్టారు. అయితే రెండు నెలలుగా మళ్లీ గోతులు ఏర్పడ్డాయి.

రోడ్డు నిర్మించి పుష్కరం

భీమడోలు–ద్వారకాతిరుమల మధ్య సుమారు 17 కిలోమీటర్ల రహదారిని గత గోదావరి పుష్కరాల సమయంలో రూ.50 కోట్లతో నాలుగు లైన్లుగా విస్తరించారు. రోడ్డు నిర్మించి పుష్కరం కావొస్తున్నా.. సమస్యలకు మాత్రం శాశ్వత పరిష్కారం లభించలేదు. ద్వారకాతిరుమల గుడి సెంటర్‌తో కలిపి సుమారు కిలోమీటరు మేర ఇంకా విస్తరణ పనులు పూర్తికాలేదు.

రహదారిద్య్రం

చినవెంకన్న క్షేత్రానికి వెళ్లే రహదారి అధ్వానం

భీమడోలు–ద్వారకాతిరుమల మార్గంలో అడుగడుగునా గోతులు

వర్షాలకు కొట్టుకుపోయిన ‘మేకప్‌’

మళ్లీ భక్తులకు ప్రమాదాల భయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement