వెన్నుపోటు పార్టీ మోసాన్ని బీసీలు గుర్తించాలి | - | Sakshi
Sakshi News home page

వెన్నుపోటు పార్టీ మోసాన్ని బీసీలు గుర్తించాలి

Sep 26 2026 12:44 AM | Updated on Sep 26 2026 12:44 AM

వెన్నుపోటు పార్టీ మోసాన్ని బీసీలు గుర్తించాలి

● రేపు కాతేరులో బీసీ గర్జన

● వైఎస్సార్‌సీపీ నేతల పిలుపు

రాజమహేంద్రవరం రూరల్‌: కూటమి ప్రభుత్వ పాలనలో బీసీలకు జరుగుతున్న ద్రోహంపై చర్చించేందుకు ఉమ్మడి తూర్పు, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలోని 34 నియోజకవర్గాలకు చెందిన బీసీ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, విద్యాధికులతో ఆదివారం సమావేశం నిర్వహిస్తున్నారు. ‘వెన్నుపోటు పార్టీ వంచనపై బీసీ గర్జన’ పేరిట నిర్వహిస్తున్న రాజమహేంద్రవరం రూరల్‌ కాతేరులోని వెంకటాద్రి గార్డెన్స్‌లో ఆ రోజు ఉదయం 10 గంటలకు సమావేశం జరుగనుంది. వైఎస్సార్‌సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ శుక్రవారం వివరాలు తెలిపారు. గర్జన ఏర్పాట్లను ఆయన, ఎమ్మెల్సీ కవురు శ్రీని వాస్‌, పార్టీ బీసీ విభాగం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, జోన్‌–2 కో–ఆర్డినేటర్‌ నవుడు వెంకట రమణ, ఏపీ గ్రీనింగ్‌ అండ్‌ బ్యూటీఫికేషన్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌, పార్టీ రాష్ట్ర కార్యదర్శి చందన నాగేశ్వర్‌ తదితరులు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్‌ మాట్లాడుతూ వెన్నుపోటు పార్టీ మోసాలపై జరిగే ఈ సమావేశం బీసీలకు అత్యంత కీలకమని అన్నారు. దీనికి అందరూ తరలివచ్చి బీసీలకు జరుగుతున్న మోసంపై గళమెత్తాలని కోరారు. వైఎస్సార్‌, వైఎస్‌ జగన్‌ చేసిన మేలును కూడా తెలియజేస్తామని చెప్పారు. నవుడు వెంకటరమణ మాట్లాడుతూ మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు ఆధ్వర్యంలో జరిగే ఈ సభను విజయవంతం చేసేందుకు కార్యాచరణ రూపొందించామని, అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశామని చెప్పా రు. బీసీలంతా సమావేశానికి హాజరు కావాలని కోరారు. చందన నాగేశ్వర్‌, బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు కొండపల్లి దుర్గారావు మాట్లాడారు. పార్టీ నాయకులు రుఖియా సయ్యద్‌, చాపా రాజా, యెజ్జు వాసు, ఆచంట కల్యాణ్‌, వాసంశెట్టి శ్రీనివాస్‌, కొల్లి నాని తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement